IND vs SL: ఒకే ఓవర్‌లో 4 వికెట్లు... సిరాజ్ దెబ్బకు శ్రీలంక బ్యాటర్ల బేజార్!
ఆసియా కప్ ఫైనల్ (Asia Cup 2023) మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. శ్రీలంక బ్యాటర్లను (IND vs SL) హడలెత్తించేలా సిరాజ్ బౌలింగ్ చేస్తున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్ ఫైనల్‌లో శ్రీలంకపై భారత బౌలర్లు అదరగొట్టేస్తున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆనందం కాసేపైనా శ్రీలంక అభిమానులకు లేకుండాపోయింది. భారత బౌలర్ల ధాటికి లంక ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలుతోంది. మరీ ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్ ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. ఇదే క్రమంలో ఐదు వికెట్ల ప్రదర్శనతో దూసుకుపోతున్నాడు. తొలుత బుమ్రా వికెట్ల వేటను ప్రారంభించగా.. సిరాజ్ తన వంతు అందిపుచ్చుకున్నాడు. శ్రీలంక బ్యాటర్లు సమరవిక్రమ, చరిత్ అసలంక, డాసున్ శానకలను డకౌట్ చేసిన సిరాజ్.. ధనంజయ డిసిల్వా (4), నిస్సాంక (2)ను పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో వన్డేల్లో 50+ వికెట్ల క్లబ్‌లోకి చేరిపోయాడు. వన్డే కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
పసుపు బోర్డు ప్రకటన వచ్చె.. ఈ రైతు కాళ్లకు చెప్పులు తెచ్చె
-
ఎత్తిపోసేందుకు.. తెచ్చిపోశారు
-
ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని ఎంబీఏ విద్యార్థిని బలవన్మరణం
-
Bandaru Satyanarayana: మాజీ మంత్రి బండారు నివాసం వద్ద అర్ధరాత్రి భారీగా పోలీసుల మోహరింపు
-
Rathika Rose: రతికా రోజ్ ఎలిమినేట్.. బద్దలైన యువ హృదయాలు..
-
Crime news : మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. బాధితురాలికి నా ఖాకీ చొక్కా ఇచ్చా : ఆటో డ్రైవర్