Asian Games: 2022 ఆసియా క్రీడలు వాయిదా.. కొవిడ్‌-19 కారణమా?

ఈ ఏడాది సెప్టెంబర్‌లో చైనాలోని హాంగ్‌జావ్‌ నగరంలో నిర్వహించాల్సిన 2022 ఆసియా గేమ్స్‌ను వాయిదా వేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు...

Published : 06 May 2022 12:53 IST

(Photo: Olympic Council of Asia Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ ఏడాది సెప్టెంబర్‌లో చైనాలోని హాంగ్‌జావ్‌ నగరంలో నిర్వహించాల్సిన 2022 ఆసియా గేమ్స్‌ను వాయిదా వేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం నిర్వాహకులు ప్రకటించారు. అయితే, అందుకు గల కారణాలను వెల్లడించలేదు. ప్రస్తుతం చైనాలో కరోనా కేసులు పెరుగుతుండటమే అందుకు కారణంగా తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. సెప్టెంబర్‌ 10 నుంచి 25 తేదీల మధ్య జరగాల్సిన ఈ గేమ్స్‌ను రీషెడ్యూల్‌ చేసే తేదీలను తర్వాత వెల్లడిస్తామని పేర్కొన్నారు. కాగా, ఈ గేమ్స్‌ నిర్వహించాల్సిన హాంగ్‌జావ్‌ ప్రాంతం అక్కడి ప్రధాన నగరమైన షాంఘైకు సమీపంలో ఉంటుంది. ప్రస్తుతం అక్కడ కొవిడ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో లాక్‌డౌన్‌ అమలుచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆసియా గేమ్స్‌ను వాయిదా వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఈ గేమ్స్‌ నిర్వహణ కోసం హాంగ్‌జావ్‌లో 56 వేదికలను రూపొందించినట్లు నిర్వాహకులు గతనెలలోనే వెల్లడించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని