Sunil Gavaskar: మన దేశం అసలు పేరు ‘భారత్’.. ఇది వినడానికి బాగుంది: సునీల్ గావస్కర్‌

కేంద్రం ‘ఇండియా’ పేరును ఆంగ్లంలో ‘భారత్‌’గా మార్చబోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దీనిపైనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో లెజెండరీ క్రికెటర్ సునీల్ గావస్కర్‌ (Sunil Gavaskar) కూడా ‘భారత్’ (Bharat) అంశంపై స్పందించారు.

Published : 06 Sep 2023 14:21 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘భారత్‌’ (Bharat) అంశంపైనే చర్చ నడుస్తోంది. కేంద్రం ‘ఇండియా’ పేరును ఆంగ్లంలో ‘భారత్‌’గా మార్చబోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. జీ20 సదస్సు నేపథ్యంలో విదేశీ నేతలకు రాష్ట్రపతి పంపిన విందు ఆహ్వాన పత్రంలో ఇండియా స్థానంలో భారత్‌ అని పేర్కొనడం, విదేశీ అతిథులకు కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసిన పుస్తకాల్లో ఇండియాకు బదులు భారత్‌ అని ముద్రించడం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది. ఈ అంశంపై పలువురు సినీ, క్రీడా ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు.

క్రీడాకారులు రాజకీయాల్లోకి రాకూడదు: వీరేందర్‌ సెహ్వాగ్‌

త్వరలో భారత్ వేదికగా జరగబోయే వన్డే ప్రపంచకప్‌లో మన ఆటగాళ్లు టీమ్‌ఇండియాకు బదులు ‘టీమ్‌భారత్‌’ జెర్సీలతో బరిలోకి దిగాలని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) అభిప్రాయపడ్డాడు. చాలా దేశాలు తిరిగి తమ అసలు పేరుకు మారాయని పేర్కొన్నాడు. తాజాగా లెజెండరీ క్రికెటర్ సునీల్ గావస్కర్‌ (Sunil Gavaskar) కూడా ‘భారత్’ (Bharat) అంశంపై స్పందించారు. మన దేశం అసలు పేరు భారత్‌ అని, ఇది వినడానికి కూడా బాగుందని వ్యాఖ్యానించారు. దీనిపై అధికారికంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. 

‘‘మన దేశం అసలు పేరు ‘భారత్’. ఇది వినడానికి కూడా బాగుంది. కానీ, దీనిపై అధికారికంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. బీసీసీఐ స్థాయిలో మన జట్టును ‘భారత్ క్రికెట్‌ టీమ్‌’ అని పిలవాలి. ఇది వరకు కూడా దేశాల పేర్లలో మార్పులు జరిగాయి. బర్మాను ఇప్పుడు మయన్మార్ అని పిలుస్తున్నారు. కాబట్టి మన దేశం కూడా అసలు పేరుకు మారొచ్చు. దీని వల్ల పెద్దగా ఇబ్బంది ఉన్నట్లు కనిపించడం లేదు. కానీ, ఇది అన్నిస్థాయిల్లో మారాల్సి ఉంటుంది’’ అని సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని