క్రీడాకారులు రాజకీయాల్లోకి రాకూడదు: వీరేందర్‌ సెహ్వాగ్‌

క్రీడాకారులు రాజకీయాల్లోకి రావడం మానుకోవాలని వీరేందర్‌ సెహ్వాగ్‌ అన్నాడు. అహం, అధికారం కోసం మాత్రమే క్రీడాకారులు రాజకీయాల్లోకి వెళ్తారని అతను అభిప్రాయపడ్డాడు.

Published : 06 Sep 2023 03:37 IST

చెన్నై: క్రీడాకారులు రాజకీయాల్లోకి రావడం మానుకోవాలని వీరేందర్‌ సెహ్వాగ్‌ అన్నాడు. అహం, అధికారం కోసం మాత్రమే క్రీడాకారులు రాజకీయాల్లోకి వెళ్తారని అతను అభిప్రాయపడ్డాడు. ‘‘నాకు రాజకీయాలపై అస్సలు ఆసక్తి లేదు. గత రెండు ఎన్నికల్లో ఇరు ప్రధాన పార్టీలు నన్ను సంప్రదించాయి. వినోదం అందించేవాళ్లు, క్రీడాకారులు రాజకీయాల్లోకి రాకూడదన్నది నా అభిప్రాయం. చాలామంది తమ అహం, అధికారం కోసం వెళ్తారు. నిజాయతీగా ప్రజల కోసం సమయాన్ని కేటాయించరు. కొందరు మాత్రమే మినహాయింపు. కానీ చాలామంది ప్రచారానికే పరిమితమవుతారు. క్రికెట్లో భాగమవడం.. వ్యాఖ్యానం చేయడం నాకెంతో ఇష్టం. పార్ట్‌టైం ఎంపీగా ఉండాలని నేనెప్పుడూ కోరుకోను’’ అని సెహ్వాగ్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని