ఐపీఎల్‌ నిర్వాహక మేనేజర్‌గా దామోదర్‌

2023 ఐపీఎల్‌ సీజన్‌ కోసం బీసీసీఐ ముగ్గురు జోనల్‌ మేనేజర్లను నియమించింది. అందులో ఒకరిగా ఇ.దామోదర్‌ ఎంపికయ్యారు.

Updated : 18 Mar 2023 16:10 IST

దిల్లీ: యువతను ఉర్రూతలూగించే ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణ మాటల్లో చెప్పలేనంత పెద్ద పని. అందుకెంతో సమన్వయం, సమర్థత అవసరం. అటువంటి ఈ బాధ్యతను ఈసారి నిర్వహించే వారిలో మన తెలుగువాడు, రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఇ.దామోదర్‌ ఉన్నారు. 2023 ఐపీఎల్‌ సీజన్‌ కోసం బీసీసీఐ ముగ్గురు జోనల్‌ ఆపరేషన్‌ మేనేజర్లను ఎంపిక చేయగా, అందులో దామోదర్‌కు చోటు లభించింది. లఖ్‌నవూ, బెంగళూరు, గువాహటి, మొహాలీ ముంబయి, చెన్నై, జైపుర్‌, దిల్లీ, అహ్మదాబాద్‌లలో జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణలో ఆయన భాగమవుతారు.

ఐపీఎస్‌ అధికారిగా దామోదర్‌ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో పలు కీలక పదవులు నిర్వహించారు. రాష్ట్ర విభజన తరవాత ఆంధ్రప్రదేశ్‌లో సేవలందించారు. చేపట్టిన ప్రతి బాధ్యతనూ విజయవంతంగా పూర్తి చేసి ప్రశంసలందుకున్నారు. ఇప్పుడు ఐపీఎల్‌ నిర్వహణలో పాలుపంచుకొనే అవకాశం పొందడం ఆయన కార్యదక్షతకు లభించిన గుర్తింపేనని చెప్పుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని