యువరాజ్‌సింగ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు!

భారత మాజీ క్రికెటర్‌, ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ చిక్కుల్లో పడ్డారు. యువీ గతేడాది ఓ సామాజిక వర్గం పేరుతో చేసిన వ్యాఖ్యలకు గానూ.. హరియాణా పోలీసులు ఆదివారం అతడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

Published : 15 Feb 2021 11:07 IST

చంఢీగఢ్‌: భారత మాజీ క్రికెటర్‌, ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ చిక్కుల్లో పడ్డారు. యువీ గతేడాది ఓ సామాజిక వర్గం పేరుతో చేసిన వ్యాఖ్యలకు గానూ.. హరియాణా పోలీసులు ఆదివారం అతడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఓ అడ్వకేట్‌ ఫిర్యాదు మేరకు హిసార్‌లోని హాన్సీ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం యువరాజ్‌పై కేసు నమోదైంది. అనంతరం పోలీసులు ఐపీసీ సెక్షన్లు 153, 153ఏ, 295, 505తో పాటు ఎస్సీ, ఎస్టీ చట్టంలోని 3(1)(ఆర్‌), 3(1)(ఎస్‌) కింద ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్‌ చేశారు. 

యువరాజ్‌సింగ్‌ గతేడాది జూన్‌లో భారత ఓపెనర్‌ రోహిత్‌ శర్మతో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సెషన్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలో యువీ తన సహచరుడైన యజువేంద్ర చాహల్‌ను ఉద్దేశిస్తూ ఓ సామాజిక వర్గం పేరుతో వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో యువీపై చర్యలు తీసుకోవాలంటూ ఓ అడ్వకేట్‌ హరియాణా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం యువీ అప్పట్లో ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ.. తాను ఎవర్నీ కావాలని కించపరిచే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు. తాను ఉద్దేశపూర్వకంగా చేయని వ్యాఖ్యల కారణంగా ఎవరి మనోభావాలైన దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు. 

ఇదీ చదవండి

అశ్విన్‌@200 ఒకే ఒక్కడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని