Sania Mirza: సానియా కొడుకు సందడి 

ఈ చిత్రంలోని చిన్నారి ఇజాన్‌ మీర్జా మాలిక్‌. కోర్టులో అమ్మ సానియా ఆడుతూ ఆకట్టుకుంటుంటే...

Updated : 05 Jul 2021 12:13 IST

ఈ చిత్రంలోని చిన్నారి ఇజాన్‌ మీర్జా మాలిక్‌. కోర్టులో అమ్మ సానియా ఆడుతూ ఆకట్టుకుంటుంటే... కోర్టు బయట నుంచి ఆమెను ఉత్సాహపరుస్తూ అందరి చూపులను తనవైపు తిప్పుకుంటున్నాడు ఈ చిన్నారి. మ్యాచ్‌లు అయిన వెంటనే తన కుమారుణ్ని ముద్దాడుతూ సానియా మురిసిపోతోంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ రెండో రౌండ్లో సానియా, బోపన్న జోడీ విజయం అనంతరం కోర్టులో వారి సంబరాల్లో కూడా ఇజాన్‌ పాలుపంచుకున్నాడు. బోపన్నకు హైఫైవ్‌ కూడా ఇచ్చాడు. ప్రేక్షకులూ ఇజాన్‌ను చూసి సంతోషించారు. మిక్స్‌డ్‌ రెండో రౌండ్లో సానియా-బోపన్న జంట 6-3, 6-1తో అయిదన్‌ మెక్‌హూ, ఎమిలి వెబ్లే స్మిత్‌ (బ్రిటన్‌) జోడీపై విజయం సాధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని