Lionel messi-Sachin: మెస్సి.. అచ్చం సచిన్‌లాగే!

క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడైన సచిన్‌, ఫుట్‌బాల్‌ ఆల్‌ టైం గ్రేట్స్‌లో ఒకడైన మెస్సిల ప్రపంచకప్‌ విజయాల్లో పోలికలుండడం విశేషం. 

Updated : 19 Dec 2022 08:59 IST

క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడైన సచిన్‌, ఫుట్‌బాల్‌ ఆల్‌ టైం గ్రేట్స్‌లో ఒకడైన మెస్సిల ప్రపంచకప్‌ విజయాల్లో పోలికలుండడం విశేషం. క్రికెట్లో సచిన్‌ పదో నంబర్‌ జెర్సీని ధరిస్తే.. ఫుట్‌బాల్‌లో మెస్సిది కూడా అదే నంబర్‌ జెర్సీ. 2003లో వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ ఓటమితో నిరాశ చెందిన మాస్టర్‌.. ఎనిమిదేళ్ల తర్వాత 2011లో ప్రపంచకప్‌ను అందుకున్నాడు.

2014లో ఫైనల్లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న మెస్సి.. ఎనిమిదేళ్లకు ఇప్పుడు కప్పును సొంతం చేసుకున్నాడు. 2011 ప్రపంచకప్‌ సెమీస్‌లో సచిన్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అందుకుంటే.. 2022 ప్రపంచకప్‌లోనూ మెస్సి సెమీస్‌లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలవడం విశేషం. వేర్వేరు క్రీడల్లో అత్యుత్తమ ఆటగాళ్లుగా పేరున్న ఇద్దరి మధ్య ఇలాంటి పోలికలుండడం విశేషమే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని