మెరిసిన సకారి

మరియా సకారి సత్తా చాటడంతో తొట్టతొలి యునైటెడ్‌ కప్‌ మిక్స్‌డ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్లో గ్రీస్‌ వరుసగా రెండో విజయాన్ని సాధించింది.

Published : 31 Dec 2022 04:12 IST

గ్రీస్‌కు రెండో విజయం
యునైటెడ్‌ కప్‌ మిక్స్‌డ్‌ టెన్నిస్‌

సిడ్నీ: మరియా సకారి సత్తా చాటడంతో తొట్టతొలి యునైటెడ్‌ కప్‌ మిక్స్‌డ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్లో గ్రీస్‌ వరుసగా రెండో విజయాన్ని సాధించింది. శుక్రవారం గ్రూప్‌-ఎ పోరులో గ్రీస్‌ 4-1తో బల్గేరియాను ఓడించింది. తొలి సింగిల్స్‌లో కుజ్మెనోవ్‌ 6-1, 6-1తో పెర్వోలారాకిస్‌పై గెలిచి బల్గేరియాకు ఆధిక్యాన్ని అందించగా.. రెండో సింగిల్స్‌లో 6-3, 6-2తో తోమావాను ఓడించిన సకారి గ్రీస్‌ను పోటీలోకి తెచ్చింది. కీలక మిక్స్‌డ్‌ డబుల్స్‌లో స్టెఫానోస్‌ సకారి తోడుగా మరియా సకారి జట్టును గెలిపించింది. ఈ పోరులో సకారి ద్వయం 6-4, 6-4తో తపలోవా-ఆండ్రీవ్‌పై నెగ్గింది. గ్రూప్‌-సిలో అమెరికా 4-1తో చెక్‌ రిపబ్లిక్‌పై గెలవగా.. గ్రూప్‌-ఇలో ఇటలీ 3-2తో బ్రెజిల్‌ను ఓడించింది. పురుషులు, మహిళలతో కూడిన 18 జట్లు 6 గ్రూపులుగా విడిపోయి బ్రిస్బేన్‌, పెర్త్‌, సిడ్నీ వేదికలుగా ఆడుతున్నాయి. ప్రతి నగరంలో గ్రూప్‌ దశలో విజేతలుగా నిలిచిన మూడు జట్లు సెమీస్‌ చేరతాయి. అన్ని నగరాల్లో ఉత్తమ ప్రదర్శన చేసిన ఓ జట్టు నాలుగో సెమీఫైనలిస్ట్‌ అవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని