జర్మనీతో బెల్జియం ఢీ

హాకీ ప్రపంచకప్‌లో ఆఖరి ఘట్టానికి వేళైంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ బెల్జియం ఆదివారం జరిగే ఫైనల్లో జర్మనీని ఢీకొంటుంది. పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా, జర్మనీ తర్వాత.. టైటిల్‌ నిలబెట్టుకున్న నాలుగో జట్టుగా నిలవాలని బెల్జియం తహతహలాడుతోంది.

Published : 29 Jan 2023 02:34 IST

హాకీ ప్రపంచకప్‌ ఫైనల్‌ నేడు
రాత్రి 7 నుంచి

భువనేశ్వర్‌: హాకీ ప్రపంచకప్‌లో ఆఖరి ఘట్టానికి వేళైంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ బెల్జియం ఆదివారం జరిగే ఫైనల్లో జర్మనీని ఢీకొంటుంది. పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా, జర్మనీ తర్వాత.. టైటిల్‌ నిలబెట్టుకున్న నాలుగో జట్టుగా నిలవాలని బెల్జియం తహతహలాడుతోంది. 2018లో టైటిల్‌ గెలిచిన బెల్జియం జట్టులోని ఆటగాళ్లలో చాలా మంది ఈసారీ ఉన్నారు. అయితే ఈ ప్రపంచ నంబర్‌-2 జట్టుకు టైటిల్‌ సాధించడం తేలికేమీ కాదు. ఫైనల్‌ ప్రత్యర్థి జర్మనీ కూడా బలమైన జట్టే. రెండు సార్లు ఛాంపియన్‌ జర్మనీ.. క్వార్టర్‌ఫైనల్‌, సెమీఫైనల్లో వెనుకబడ్డా, గొప్పగా పుంజుకుని పైచేయి సాధించింది. ‘‘జర్మనీ జట్టంటే మాకెంతో గౌరవం. ఈ టోర్నమెంట్లో రెండు సార్లు వెనుకంజలో నిలిచినా పోరాటపటిమను ప్రదర్శించి గెలిచింది. పోరాటం వాళ్ల సంస్కృతిలోనే ఉంది’’ అని బెల్జియం కోచ్‌ మైకెల్‌ వాన్‌ డెల్‌ హెవెల్‌ అన్నాడు. ఇప్పటివరకు రెండు జట్లు 35 మ్యాచ్‌ల్లో తలపడగా బెల్జియం 15 సార్లు నెగ్గింది. జర్మనీ  13 మ్యాచ్‌లు నెగ్గింది. ఏడు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. కాంస్య పతక పోరులో ఆస్ట్రేలియా జట్టు నెదర్లాండ్స్‌తో తలపడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని