లంక ఖాతాలో రెండో వన్డే
అఫ్గానిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ను కోల్పోయిన ఆతిథ్య శ్రీలంక.. రెండో వన్డేలో సత్తా చాటింది.
హంబన్‌టోట: అఫ్గానిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ను కోల్పోయిన ఆతిథ్య శ్రీలంక.. రెండో వన్డేలో సత్తా చాటింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో 132 పరుగుల తేడాతో ప్రత్యర్థిని ఓడించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. మొదట లంక 50 ఓవర్లలో 6 వికెట్లకు 323 పరుగులు సాధించింది. కుశాల్ మెండిస్ (78; 75 బంతుల్లో 7×4, 1×6) దిముత్ కరుణరత్నే (52) అర్ధసెంచరీలతో మెరిశారు. నిశాంక (43), సమరవిక్రమ (44), ధనంజయ డిసిల్వా (29 నాటౌట్), హసరంగ (29 నాటౌట్) కూడా తలో చేయి వేసి స్కోరును 300 దాటించారు. ఛేదనలో హసరంగ (3/42), ధనంజయ డిసిల్వా (3/39), చమీర (2/18)ల ధాటికి అఫ్గాన్ 42.1 ఓవర్లలో 191 పరుగులకే ఆలౌటైంది. 32 ఓవర్లకు 152/3తో మెరుగ్గానే కనిపించిన అఫ్గాన్.. ఆ తర్వాత లంక స్పిన్నర్ల ధాటికి 39 పరుగుల తేడాతో 7 వికెట్లు కోల్పోయి ఓటమి చవిచూసింది. కెప్టెన్ హస్మతుల్లా (57; 62 బంతుల్లో 6×4), ఇబ్రహీం జద్రాన్ (54; 75 బంతుల్లో 2×4, 2×6), రహ్మత్ షా (36; 42 బంతుల్లో 3×4)ల పోరాటం సరిపోలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
China: సముద్ర ఉచ్చులో చైనా అణు జలాంతర్గామి.. 55 మంది సబ్‌మెరైనర్ల మృతి..!
-
KTR: దిల్లీ బాస్‌ల అనుమతి లేకుండానే లక్ష్మణ్ అలా మాట్లాడారా?: కేటీఆర్
-
Rajinikanth: ‘తలైవా 170’ గురించి ఆసక్తికర విషయం పంచుకున్న రజనీకాంత్..
-
MS Dhoni: ప్రపంచ కప్‌లో మాహీ... ఎందుకంత స్పెషల్ అంటే!
-
US Speaker: అమెరికా చరిత్రలో తొలిసారి.. స్పీకర్‌కు ఉద్వాసన
-
Delhi Liquor Scam: ఆప్ నేత సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు