పాక్‌ మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో పెట్టమని ముందే సూచించా: పీసీబీ మాజీ ఛైర్మన్‌ నజామ్‌ సేథీ

ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో నిర్వహించాలని ముందే బీసీసీఐకి సలహా ఇచ్చానని..

Updated : 22 Aug 2023 08:15 IST

కరాచి: ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో నిర్వహించాలని ముందే బీసీసీఐకి సలహా ఇచ్చానని.. కానీ పెడ చెవిన పెట్టడంతో ఇప్పుడు షెడ్యూల్‌ విషయంలో భారత బోర్డు ఇబ్బంది పడుతోందని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) మాజీ ఛైర్మన్‌ నజామ్‌ సేథీ అన్నాడు. ఇప్పటికే ప్రపంచకప్‌ షెడ్యూల్‌లో బీసీసీఐ ఒకసారి సవరించింది. అయితే హైదరాబాద్‌లో జరిగే రెండు మ్యాచ్‌లు వరుస తేదీల్లో ఉండడంతో మార్పు చేయాలని హెచ్‌సీఏ కోరడంతో మళ్లీ సమస్య తెరమీదకు వచ్చింది. కానీ షెడ్యూల్‌ను మళ్లీ సవరించబోమని బీసీసీఐ స్పష్టం చేసింది. ‘‘పాకిస్థాన్‌ మ్యాచ్‌లను తటస్థ దేశంలో నిర్వహించాలని నా సలహాను బీసీసీఐ అంగీకరించాల్సింది. ఇప్పుడు షెడ్యూల్‌ విషయంలో బోర్డు బాగా ఇబ్బందిపడుతోంది’’ అని సేథీ ట్వీట్‌ చేశాడు. షెడ్యూల్‌ ప్రకారం ఉప్పల్‌ స్టేడియంలో అక్టోబర్‌ 9న న్యూజిలాండ్‌-నెదర్లాండ్స్‌, అక్టోబర్‌ 10న పాకిస్థాన్‌-శ్రీలంక తలపడాల్సి ఉంది. 12న  ఈ వేదికలోనే మరో మ్యాచ్‌ ఉన్నా.. దాన్ని బీసీసీఐ రీషెడ్యూల్‌ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని