India vs Pakistan: ఇదేనా సన్నద్ధత?
నిప్పులు చెరిగే బంతులతో పరీక్షించే షహీన్ అఫ్రిదిని భారత బ్యాటర్లు ఎదుర్కోగలరా? పాక్‌తో మ్యాచ్ ముంగిట అందరిలో తలెత్తిన ప్రశ్న ఇదే. మ్యాచ్‌కు ముందు రోజు విలేకరుల సమావేశంలో ఇదే ప్రశ్న ఎదురైంది టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు.
ఈనాడు క్రీడావిభాగం
నిప్పులు చెరిగే బంతులతో పరీక్షించే షహీన్ అఫ్రిదిని భారత బ్యాటర్లు ఎదుర్కోగలరా? పాక్‌తో మ్యాచ్ ముంగిట అందరిలో తలెత్తిన ప్రశ్న ఇదే. మ్యాచ్‌కు ముందు రోజు విలేకరుల సమావేశంలో ఇదే ప్రశ్న ఎదురైంది టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు. అయితే షహీన్, మిగతా పాక్ పేసర్లను ఎదుర్కోగల అనుభవం తమ జట్టుకు ఉందని ధీమా వ్యక్తం చేశాడు రోహిత్. కానీ మ్యాచ్‌లో ఆ అనుభవం అక్కరకు రాలేదు. జట్టులో అత్యంత అనుభవజ్ఞులైన కోహ్లి, రోహిత్.. షహీన్ ముందు నిలవలేకపోయాడు. బౌల్డయి వెనుదిరిగారు. మిగతా బ్యాటర్లకు కూడా షహీన్‌ను ఎదుర్కోవడం శక్తికి మించిన పనే అయింది. ప్రపంచకప్‌నకు ఇంకో నెల రోజుల సమయమే ఉంది. ఈ సమయానికి జట్టు పూర్తి సన్నద్ధతతో, ఆత్మవిశ్వాసంతో ఉండాలి. కానీ ప్రధాన బ్యాటర్లు ఎవరూ ఉత్తమ ఫామ్‌లో కనిపించడం లేదు. జట్టు ఎన్నో ఆశలు పెట్టుకున్న కోహ్లి, రోహిత్‌లే నిలకడగా ఆడట్లేదు. పాక్‌తో కీలక పోరులో వీళ్లిద్దరూ విఫలమవడం ఆందోళన రేకెత్తించేదే. ఇక ఐపీఎల్‌లో, అంతకుముందు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో పరుగుల వరద పారించిన ఓపెనర్ శుభ్‌మన్ ఉన్నట్లుండి లయ కోల్పోయాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో, వెస్టిండీస్ పర్యటనలో నిరాశ పరిచాడు. ఇప్పుడు పాక్‌తో మ్యాచ్‌లోనూ అతను తేలిపోయాడు. శ్రేయస్ పునరాగమనంలో సత్తా చాటుతాడనుకుంటే.. అతడి జోరు రెండు షాట్లకు పరిమితం అయింది. ఇషాన్, హార్దిక్ పట్టుదలతో నిలిచి పోరాడారు కాబట్టి భారత్ మెరుగైన స్కోరు చేయగలిగింది. లేదంటే పరిస్థితి ఘోరంగా ఉండేది. ఇషాన్, హార్దిక్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాక 300 స్కోరు చేసే అవకాశాన్ని భారత్ కోల్పోవడం ఆందోళన రేకెత్తించే విషయం. మంచి స్థితి నుంచి చకచకా వికెట్లు కోల్పోయి కుప్పకూలడం శుభ సూచకం కాదు. ఈ మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాకపోయి ఉంటే భారత్ గెలిచేదని ధీమాగా చెప్పలేని పరిస్థితి. ప్రపంచకప్ ముంగిట పాక్ చేతిలో ఓడితే ఆత్మవిశ్వాసం ఎంతగా దెబ్బ తినేదో అంచనా వేయొచ్చు. మ్యాచ్ సాగినంత వరకు అయితే భారత్ ప్రదర్శన ఆశాజనకంగా లేని మాట వాస్తవం. ఈ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని గాడిన పడకపోతే ప్రపంచకప్‌లో భారత్‌కు కష్టమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
KTR: ఓఆర్ఆర్ చుట్టూ సైకిల్ ట్రాక్.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్
-
Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
ODI WC 2023: రోహిత్ ఫామ్‌లో ఉంటే తట్టుకోవడం కష్టం: పాక్ వైస్ కెప్టెన్
-
USA vs China: ‘తప్పుడు సమాచారం’పై.. అమెరికా-చైనా మాటల యుద్ధం
-
Social Look: దీపికా పదుకొణె ‘కోల్డ్ మీల్’.. శ్రీనిధి శెట్టి ‘ఈఫిల్ టవర్’ పిక్!
-
Manipur : మణిపుర్ విద్యార్థుల హత్య కేసు.. నలుగురిని అరెస్టు చేసిన సీబీఐ