Pat Cummins: అత్యంత సంతృప్తినిచ్చింది అదే

ఆటల్లో భారీ అభిమానగణం మూగబోయేలా చేయడం కంటే సంతృప్తినిచ్చే విషయం మరొకటి లేదని, భారత్‌తో వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో తమ లక్ష్యం అదే అని మ్యాచ్‌కు ముందు అన్నాడు ఆస్ట్రేలియా కెప్టెన్‌ కమిన్స్‌.

Updated : 21 Nov 2023 04:30 IST

టల్లో భారీ అభిమానగణం మూగబోయేలా చేయడం కంటే సంతృప్తినిచ్చే విషయం మరొకటి లేదని, భారత్‌తో వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో తమ లక్ష్యం అదే అని మ్యాచ్‌కు ముందు అన్నాడు ఆస్ట్రేలియా కెప్టెన్‌ కమిన్స్‌. ఆదివారం అదే జరిగింది. ఆస్ట్రేలియా విజృంభణతో భారత అభిమానులు మౌనంగా ఉండిపోయారు. ఈ నిశ్శబ్దంలో తనకు అత్యంత సంతృప్తినిచ్చిన సందర్భం గురించి కమిన్స్‌ మాట్లాడాడు. ‘‘కోహ్లిని ఔట్‌ చేయడం మాకు అత్యంత తీయనైన సందర్భం. స్టేడియంలో నెలకొన్న నిశ్శబ్దాన్ని గుర్తించడానికి మాకు ఒక క్షణం పట్టింది. మరోసారి అతను సెంచరీ చేయడానికి సిద్ధమైనట్లు కనిపించిన తరుణంలో ఔట్‌ చేయడంలో ఎంతో సంతృప్తినిచ్చింది’’ అని కమిన్స్‌ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు