Google Bard - Team India: వన్డే ప్రపంచకప్.. గూగుల్ బార్డ్ చెప్పిన భారత్ తుది జట్టు ఇదే
ఏఐ టూల్ గూగుల్ బార్డ్ (Google Bard)ను ఈ ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఫేవరెట్ ప్లేయింగ్ ఎలెవన్‌ని ఎంపిక చేసుకోమని అడగ్గా.. 15 మంది ఆటగాళ్లతో కూడిన భారత జట్టులో 11 మంది ఆటగాళ్లను ఎంపికచేసింది.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్ (World Cup 2023) సందడి అక్టోబర్ 5 నుంచి షురూ అవ్వనుంది. అయితే, ఇప్పుడు అందరి దృష్టి అంతా టీమ్‌ఇండియా (Team India) తుది జట్టు కూర్పుపైనే ఉంది. ఆడే అవకాశం ఎవరికి దక్కుతుంది, బెంచ్‌కు ఎవరు పరిమితమవుతారనే దానిపై క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్ బార్డ్ (Google Bard)ను టీమ్‌ఇండియా ఫేవరెట్ ప్లేయింగ్ ఎలెవన్ ఏంటి అని అడిగితే... ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ఈ జాబితాలో ఎవరికి చోటు దక్కిందంటే..
గూగుల్ బార్డ్ టీమ్ఇండియా ప్లేయింగ్ ఎలెవన్
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి.
గూగుల్ బార్డ్ తుది జట్టులో చోటు దక్కని ఆటగాళ్లు
సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్.
ప్రపంచకప్‌లో ఏ 11 మంది దిగితే మంచిది? మీ ఆలోచన ఏంటి?
దాంతోపాటు వారిని ఎందుకు తన ఫేవరెట్ XIలో పెట్టింది అనే విషయం కూడా బార్డ్ తెలిపింది. తాను ఎంపిక చేసిన జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఆల్‌రౌండర్ విభాగాల్లో సమతూకంగా ఉందని పేర్కొంది. ఆ ఆటగాళ్లను ఎంచుకోవడానికి గల కారణాలను కూడా వివరించింది. అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్లతో కూడిన ఈ జట్టుకు ప్రపంచకప్ గెలవడానకి అవసరమైన సత్తా ఉందని తెలిపింది.
కారణాలు ఇవే...
రోహిత్ శర్మ: ప్రపంచంలోని అత్యంత విధ్వంసకర ఓపెనర్లలో రోహిత్ శర్మ ఒకరు. అతను చాలా అనుభవజ్ఞుడైన కెప్టెన్. ఇటీవల కాలంలో మంచి ఫామ్‌లో ఉన్నాడు. ప్రపంచ కప్‌లో భారత్‌ను విజయపథంలో నడిపించాలని చూస్తున్నాడు.
శుభ్‌మన్ గిల్: ఈ యువ, ప్రతిభావంతుడైన బ్యాటర్ ఇటీవల కాలంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. టాప్ ఆర్డర్‌లో రోహిత్ శర్మకు మంచి భాగస్వామి. అన్నిరకాల షాట్లు ఆడటంతోపాటు చక్కగా స్ట్రైక్ రొటేట్ చేస్తాడు.
విరాట్ కోహ్లీ: ఆల్ టైమ్ గ్రేట్ బ్యాటర్లలో విరాట్ ఒకరు. మ్యాచ్ విన్నర్ విన్నర్, భారీ ఇన్నింగ్స్ ఆడగల సమర్థుడు. ప్రపంచ కప్‌లో భారీగా పరుగులు చేయాలని చూస్తున్నాడు.
శ్రేయస్ అయ్యర్: శ్రేయస్ అయ్యర్ నమ్మకమైన బ్యాటర్. నిలకడగా ఆడగలడు, మంచి ఫీల్డర్ కూడా. పేస్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటాడు. స్పిన్ బౌలింగ్‌లో కూడా పరుగులు చేయగలడు. పార్ట్ టైమ్ స్నిన్నర్‌గాను ఉపయోగపడతాడు.
కేఎల్ రాహుల్: రాహుల్ చాలా రకాలుగా జట్టుకు సేవలందిస్తాడు. ఇతను మంచి బ్యాటర్, వికెట్‌కీపర్. టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయగలడు. మీడియం పేస్ బౌలర్‌గా ఉపయోగించుకోవచ్చు.
హార్దిక్ పాండ్య: ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్‌రౌండర్, మంచి హిట్టర్. మీడియం పేస్ బౌలింగ్ చేయగలడు. భారత్‌కు అత్యంత కీలకమైన ఆటగాడు, ప్రపంచ కప్‌లో గట్టి ప్రభావం చూపుతాడు.
రవీంద్ర జడేజా: జడేజా కూడా ప్రపంచ స్థాయి ఆల్ రౌండర్. స్పిన్‌లో బౌలింగ్‌లో బాగా పరుగులు రాబట్టగలడు. పేస్ బౌలింగ్‌ను కూడా బాగా ఎదుర్కొంటాడు. మంచి ఫీల్డర్ కూడా. కుడి, ఎడమ రెండు చేతులతో స్పిన్ బౌలింగ్ చేయగలడు.
రవిచంద్రన్ అశ్విన్: ప్రపంచంలోని అత్యుత్తమ ఆఫ్ స్పిన్నర్లలో అశ్విన్ ఒకరు. మంచి బ్యాటర్, ఫీల్డర్ కూడా. వికెట్లు పడేలా బౌలింగ్ చేయడంలో దిట్ట. తన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయగలడు.
కుల్దీప్ యాదవ్: ఇతను చాలా ప్రమాదకరమైన మిస్టరీ స్పిన్నర్. ముఖ్యంగా ఎడమచేతి వాటం బ్యాటర్‌లపై ఎక్కువ ప్రభావం చూపిస్తాడు. వికెట్ టేకింగ్ బౌలర్. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను తన స్పిన్‌తో అడ్డుకుంటాడు.
జస్‌ప్రీత్ బుమ్రా: ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో బుమ్రా ఒకరు. వేగంగా, కచ్చితత్వంతో బౌలింగ్ చేస్తాడు. యార్కర్లు, బౌన్సర్లు వేయడంలో ఆరితేరినవాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయడంలో దిట్ట. బుమ్రా భారత్‌కు చాలా కీలక ఆటగాడు. అతను ప్రపంచ కప్‌లో మంచి ప్రదర్శన చేయాలని చూస్తున్నాడు.
మహ్మద్ షమి: షమి మంచి బౌలర్. మంచి స్పీడ్‌తో బౌలింగ్ చేయడంతోపాటు బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలడు. వికెట్లు రాబట్టేలా బౌలింగ్ చేయడంలో సమర్థుడు. ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయగలడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
T10 League: ఇదేం బ్యాటింగ్ గురూ.. 43 బంతుల్లో 193 పరుగులా?
క్రికెట్లో రికార్డులు అధిగమించడం సహజమే. అయితే, ఒక్కో ఇన్నింగ్స్‌లో కేవలం 60 బంతులు మాత్రమే ఉండే టీ10 ఫార్మాట్లో హాఫ్ సెంచరీనే కష్టమనుకుంటే.. సెంచరీతోపాటు ద్విశతకానికి కాస్త చేరువగా రావడం నెట్టింట వైరల్‌గా మారిపోయింది. -
ICC: వరల్డ్ కప్ ‘ఫైనల్’ పిచ్ యావరేజ్.. వివాదాస్పదమైన భారత్-కివీస్ సెమీస్ ‘పిచ్’ రేటింగ్ ఎంతంటే?
భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచ కప్ (ODI World Cup 2023) పిచ్‌ల రిపోర్ట్‌ను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. ఇందులో టీమ్ఇండియా ఆడిన లీగ్‌లతోపాటు రెండు సెమీస్‌లు, ఫైనల్ మ్యాచ్ నివేదికలు ఉన్నాయి. -
Sreesanth: ‘ఫిక్సర్’ వ్యాఖ్యలు.. శ్రీశాంత్‌కు లీగల్ నోటీసులు
మైదానంలో భారత మాజీ క్రికెటర్లు ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో లీగ్ నిర్వాహకులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. -
SA vs IND : దక్షిణాఫ్రికా పర్యటన.. ఇప్పుడీ సిరీస్‌లతో భారత్‌కు కలిగే ప్రయోజనాలివే..
విదేశీ గడ్డపై తొలిసారి సిరీస్‌లు ఆడేందుకు యువ ఆటగాళ్లు ఉత్సాహంగా ఉన్నారు. దక్షిణాఫ్రికా పర్యటనకు టీమ్ఇండియా (SA vs IND) సిద్ధమైంది. -
Virat Kohli: విరాట్ నిర్ణయం ఏమిటో?
నిరుడు టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో భారత ఓటమి తర్వాత రోహిత్, కోహ్లి తిరిగి పొట్టి ఫార్మాట్లో ఆడలేదు. -
IPL 2024: గుజరాత్ టైటాన్స్‌కు మరో షాక్ తప్పదా! షమి ఫ్రాంఛైజీ మారతాడా?
గుజరాత్ టైటాన్స్‌కు మరో షాక్ తగిలే అవకాశముంది. ఆ జట్టు ప్రధాన పేసర్ మహ్మద్ షమి (Mohammed Shami) ఫ్రాంఛైజీ మారే ఛాన్స్ ఉందని వార్తలొస్తున్నాయి. -
IND vs SA: రేసులోకి వచ్చేదెవరో?
ఓపెనర్ ఎవరు? మూడో స్థానంలో వచ్చేదెవరు? వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఆడేదెవరు? ఫినిషర్ దొరికేశాడా? యువ స్పిన్నర్ అవకాశం పట్టేస్తాడా? -
జైపుర్-బెంగాల్ సగం సగం
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-10లో తొలి టై. జైపుర్ పింక్ పాంథర్స్, బెంగాల్ వారియర్స్ మధ్య ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ చివరికి 28-28తో సమమైంది. -
విజృంభించిన కరన్, లివింగ్స్టన్
వెస్టిండీస్‌తో తొలి వన్డేలో ఓడిన ఇంగ్లాండ్ పుంజుకుంది. సామ్ కరన్ (3/33), లివింగ్స్టన్ (3/39) విజృంభించడంతో రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో గెలిచి మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. -
Sreesanth - Gambhir: గంభీర్ నన్ను ఫిక్సర్ అన్నాడు
టీమ్ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తనను ఫిక్సర్ అన్నాడని మాజీ పేసర్ శ్రీశాంత్ గురువారం ఆరోపించాడు. -
NeeraJ Chopra: అందుకు నీరజే కారణం
భారత అథ్లెటిక్స్‌లో జరుగుతున్న మంచి విషయాలకు నీరజ్ చోప్రానే కారణమని, అతణ్ని ఆరాధిస్తానని సహచర జావెలిన్ త్రో అథ్లెట్ కిశోర్ కుమార్ పేర్కొన్నాడు. -
కోహ్లికి శతకాల సెంచరీ కష్టమే
విరాట్ కోహ్లికి 100 అంతర్జాతీయ సెంచరీలు చేయడం తేలికేం కాదని వెస్టిండీస్ దిగ్గజం బ్రయాన్ లారా అన్నాడు. -
స్పెయిన్ చేతిలో భారత్ ఓటమి
జూనియర్ హాకీ ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో కొరియాపై ఘన విజయం సాధించిన భారత జట్టుకు చేదు అనుభవం. -
అథ్లెట్లకు కఠోర ఆర్మీ శిక్షణ
వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో తమ దేశ అథ్లెట్లు మెరుగైన ప్రదర్శన చేసే దిశగా వాళ్ల మానసిక సామర్థ్యాన్ని పెంచేందుకు దక్షిణ కొరియా ఒలింపిక్ కమిటీ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. -
అజిత్‌కు రెండో స్థానం
అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) గ్రాండ్‌ప్రి-2 వెయిట్‌లిఫ్టింగ్ ఈవెంట్లో నారాయణ్ అజిత్ (73 కేజీ) గ్రూప్-సిలో రెండో స్థానంలో నిలిచాడు. -
డబ్ల్యూపీఎల్ కమిటీ అధ్యక్షుడిగా రోజర్
మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) అభివృద్ధి కోసం బీసీసీఐ ఎనిమిది మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.


తాజా వార్తలు (Latest News)
-
BJP: కొత్త సీఎంలపై ఇంకా వీడని ఉత్కంఠ.. కమిటీలు వేసిన భాజపా
-
Revanth Reddy: తెలంగాణ విద్యుత్ రంగంపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
-
ChandraBabu: జగన్ ప్రభుత్వం కూడా అహంకారంతో ఉంది: చంద్రబాబు
-
Bobby Deol: ఇంతటి విజయాన్ని ఊహించలేదు.. ఆయన నా జీవితాన్ని మార్చేశారు : బాబీ దేవోల్
-
TS Assembly: శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ
-
Supreme Court: విచారణకు ముందు ఎక్కువ రోజులు జైలులో ఉంచలేం: మద్యం కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు