Pakistan: పాకిస్థాన్‌కు సెమీస్‌ అవకాశాలు.. ఇంగ్లాండ్‌పై ఎంత తేడాతో గెలవాలంటే?

శ్రీలంకపై న్యూజిలాండ్ ఘన విజయం సాధించి సెమీస్‌కు అడుగు దూరంలో నిలిచింది. ప్రస్తుతం ఎనిమిది పాయింట్లతో ఉన్న పాక్, అఫ్గాన్‌లకు ఇంకా సెమీస్ అవకాశాలు సజీవంగానే ఉన్నాయి.

Updated : 09 Nov 2023 21:29 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటికే భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్‌కు అర్హత సాధించాయి. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారీ విజయం అందుకున్న న్యూజిలాండ్ సెమీస్‌కు అడుగు దూరంలో నిలిచింది. కివీస్ ప్రస్తుతం (0.922) నెట్‌ రన్‌రేట్‌తో ఉంది. అయితే, ప్రస్తుతం ఎనిమిది పాయింట్లతో ఉన్న పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌లకు ఇంకా సెమీస్‌ చేరే ఛాన్స్‌ ఇంకా ఉంది. పాక్‌ (0.036), అఫ్గాన్‌ (-0.338) నెట్‌ రన్‌రేట్‌తో ఉన్నాయి. 

కివీస్‌ రన్‌రేట్‌ను అధిగమించాలంటే పాకిస్థాన్‌, అఫ్గాన్‌ తమ చివరి లీగ్‌ మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో పాకిస్థాన్‌ మొదటి బ్యాటింగ్‌ చేస్తే 287 పరుగులు లేదా అంతకంటే ఎక్కువ తేడాతో విజయం సాధించాలి. ఒకవేళ ఇంగ్లాండ్ మొదటి బ్యాటింగ్ చేస్తే.. ఆ జట్టుని 150లోపు కట్టడి చేసి ఆ లక్ష్యాన్ని 3.4 ఓవర్లలో ఛేదించాలి. పాకిస్థాన్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి 400 స్కోరు సాధించి ఇంగ్లాండ్‌ను 112 లోపు కట్టడి చేస్తే న్యూజిలాండ్ రన్‌రేట్‌ని అధిగమిస్తుంది. ఇక.. సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ 438 పరుగుల తేడాతో విజయం సాధిస్తే సెమీస్‌కు చేరే అవకాశం ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని