Rohit - Hogg : ఒత్తిడికి గురైనప్పుడు రోహిత్‌ను చూడాలని ఉంది: బ్రాడ్ హాగ్‌

టీమ్‌ఇండియా పూర్తిస్థాయి కెప్టెన్‌గా ఎంపికైన రోహిత్ శర్మకు అన్నీ...

Published : 19 Mar 2022 01:29 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : టీమ్‌ఇండియా పూర్తిస్థాయి కెప్టెన్‌గా ఎంపికైన రోహిత్ శర్మకు అన్నీ కలిసొస్తున్నాయి. స్వదేశంలో విండీస్, లంకపై సిరీస్‌లను కైవసం చేసుకుని ఊపు మీదున్నాడు. ఇదే క్రమంలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లోనూ సారథిగా ఆరోసారి ముంబయికి కప్‌ను అందించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే రోహిత్ శర్మకు అసలైన పరీక్ష పెద్ద జట్లతో ఉంటుందని, అదేవిధంగా టీ20 ప్రపంచకప్‌లోనూ కఠిన సవాల్‌ ఎదురవుతుందని ఆసీస్‌ మాజీ స్పిన్నర్‌ బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు. 

‘‘రాబోయే సీజన్‌లో ఆసీస్‌తో నాలుగు టెస్టులను భారత్‌ ఆడనుంది. అలానే ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాతో సిరీస్‌లూ ఉన్నాయి. ఇవన్నీ రోహిత్ శర్మకు సవాల్‌ విసిరేవే. ఈ ఏడాది ఆసీస్‌ వేదికగా టీ20 ప్రపంచ కప్‌ ఉంది. ఇటువంటి సమయంలో రోహిత్ తన బాడీ లాంగ్వేజ్‌ను ఇప్పటిలా కొనసాగిస్తాడా? సహనం కోల్పోతాడా అనేది వేచి చూడాలి. వచ్చే సిరీస్‌లన్నీ రోహిత్‌ను ఒత్తిడిలోకి నెట్టేవే. అందుకే రోహిత్ ఒత్తిడిలో ఎలా జట్టును నడిపిస్తాడో చూడాలని ఉంది’’ అని హాగ్‌ పేర్కొన్నాడు. మార్చి 26 నుంచి మే 29 వరకు ఐపీఎల్ జరుగుతుంది. ఆ తర్వాత ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా పర్యటనలు, టీ20 ప్రపంచకప్‌... ఇలా వరుస షెడ్యూల్‌తో టీమ్‌ఇండియా బిజీగా గడపనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని