IND vs ENG: మరోసారి అతడికే చిక్కి...పూజారా చెత్త రికార్డు

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో  జరుగుతున్న కీలక టెస్టులో టీమ్‌ఇండియా ఓపెనర్‌గా వచ్చిన ఛెతేశ్వర్‌ పూజారా 13 పరుగులే ఔట్‌ అయ్యాడు. అయితే అతడు మరోసారి

Updated : 01 Jul 2022 19:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో  జరుగుతున్న కీలక టెస్టులో టీమ్‌ఇండియా ఓపెనర్‌గా వచ్చిన ఛెతేశ్వర్‌ పూజారా 13 పరుగులే ఔట్‌ అయ్యాడు. అయితే అతడు మరోసారి జేమ్స్‌ అండర్సన్‌ బౌలింగ్‌లోనే  స్లిప్‌లో క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. పూజారాను ఇంతకుముందు జిమ్మీ 11 సార్లు  ఔట్‌ చేశాడు. ఈ మ్యాచ్‌తో అండర్సన్‌ అత్యధికసార్లు  ఔట్‌ చేసిన  బ్యాటర్ల జాబితాలో పూజారా టాప్‌లో నిలిచి చెత్త రికార్డును ముటగట్టుకున్నాడు. గతేడాది జరిగిన ఇదే టెస్టు సిరీస్‌లో అండర్సన్‌ స్వింగ్‌ బంతులు ఆడలేక మొదటి, రెండు, నాలుగో టెస్టులో( రెండుసార్లు)  వికెట్‌కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. పూజారా బలహీనతను  ఆసరాగా చేసుకొని జిమ్మి మరోసారి అలాంటి బంతులనే సంధించి ఐదో టెస్టులోనూ బుట్టలో వేసుకున్నాడు. మొత్తంగా ఈ సిరీస్‌లో 4,9,1,4,13 పరుగుల వద్ద అండర్సన్‌ బౌలింగ్‌లోనే ఐదు సార్లు ఔటవ్వడం. గమనార్హం. ఇక ఈ ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్ లోనైనా పూజారా జిమ్మికి చిక్కకుండా ఉంటాడేమో చూడాలి.

అండర్సన్‌ టెస్టుల్లో  అత్యధిక సార్లు ఔట్‌  చేసిన బ్యాట్స్‌మన్‌ జాబితా : పూజారా (12), పీటర్‌ పిడిల్‌ (11), డేవిడ్‌ వార్నర్‌ (10).

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని