India vs England: రద్దయిన ఐదో టెస్టు జరిగేది ఆరోజే..

కరోనా కారణంగా భారత్, ఇంగ్లాండ్ మధ్య రద్దయిన ఐదో టెస్టుపై స్పష్టత వచ్చేసింది. ఈ టెస్టును జూలై 1 2022 నుంచి నిర్వహించనున్నట్లు ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది.  ఈ ఏడాది సెప్టెంబరులో ఈ మ్యాచ్ జరగాల్సి ఉండగా.. భారత శిబిరంలో వరుసగా కరోనా కేసులు నమోదవడంతో ఇరు

Published : 22 Oct 2021 23:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా కారణంగా భారత్, ఇంగ్లాండ్ మధ్య రద్దయిన ఐదో టెస్టుపై స్పష్టత వచ్చేసింది. ఈ టెస్టును వచ్చే ఏడాది జులై 1 నుంచి నిర్వహించనున్నట్లు ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబరులో ఈ మ్యాచ్ జరగాల్సి ఉండగా.. భారత శిబిరంలో వరుసగా కరోనా కేసులు నమోదవడంతో ఇరు బోర్డులు ఏకాభిప్రాయానికి వచ్చి ఐదో టెస్టును తాత్కాలికంగా రద్దు చేశాయి. అనంతరం ఈ మ్యాచ్ అంశంపై బీసీసీఐ, ఈసీబీ విస్తృతంగా చర్చలు జరిపి.. సిరీస్‌లో విజేతను తేల్చేందుకు ఐదో టెస్ట్ నిర్వహించాలని నిర్ణయించాయి. వచ్చే ఏడాది భారత్, ఇంగ్లాండ్ మధ్య టీ20, వన్డే సిరీస్‌లు జరగనున్నాయి. ఆ సమయంలోనే ఈ టెస్టు కూడా నిర్వహించనున్నారు. సిరీస్ వాయిదాపడే సమయానికి ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ జట్టు 2-1తో అధిక్యంలో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని