IPL Mega Auction : శ్రేయస్‌ను అధిగమించిన ఇషాన్‌ కిషన్‌.. ఆల్‌రౌండర్లకు భారీ డిమాండ్

 ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మెగా వేలం ఉత్కంఠభరితంగా సాగుతోంది. గత ...

Updated : 12 Feb 2022 18:20 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మెగా వేలం ఉత్కంఠభరితంగా సాగుతోంది. గత వేలంలో తక్కువ మొత్తం పొందిన కొందరు క్రికెటర్లు ఈసారి భారీ ధరను సొంతం చేసుకుని రికార్డులు సృష్టిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన వేలం ప్రకారం.. టీమ్‌ఇండియా యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ అత్యధిక ధరను సొంతం చేసుకున్నాడు. గుజరాత్‌ టైటాన్స్‌, ముంబయి ఇండియన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పోటీ పడటంతో ధర భారీగా పెరిగింది. అయితే పాత జట్టు ముంబయి ఇండియన్స్‌ చివరికి ఇషాన్‌ కిషన్‌ను రూ. 15.25 కోట్లకు దక్కించుకుంది. గతేడాది ఇషాన్‌కు వచ్చింది రూ. 6.20 కోట్లే. ముంబయి ఇండియన్స్‌లో రోహిత్ శర్మ (రూ.16 కోట్లు) తర్వాత ఇషాన్‌ కిషనే అత్యంత విలువైన ఆటగాడు. ప్రస్తుతం జరుగుతున్న మెగా వేలంలో శ్రేయస్‌ అయ్యర్‌ రూ. 12.25 కోట్ల రికార్డును ఇషాన్‌ అధిగమించాడు. 

వీరిపై కురిసిన కాసుల వర్షం..

క్రికెట్‌లో వ్యక్తిగతంగా అద్భుత ప్రదర్శన ఇస్తే ఫలితం ఎలా ఉంటుందో ఈ మెగా వేలంలో ఆటగాళ్లు అందుకుంటున్నారు. గతేడాది అత్యధిక వికెట్లు తీసి పర్పుల్‌ క్యాప్‌ అందుకున్న హర్షల్‌ పటేల్‌పై కాసుల వర్షం కురిసింది. అలానే లంక ఆల్‌రౌండర్‌ వనిందు హసరంగకూ భారీ మొత్తం దక్కింది. వీరిద్దరిని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టే రూ. 10.75 కోట్లు చొప్పున సొంతం చేసుకుంది. నికోలస్‌ పూరన్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రూ. 10.75 కోట్లకు దక్కించుకుంది. ఎస్‌ఆర్‌హెచ్‌ తరఫున రాణించిన ఆల్‌ రౌండర్‌ జాసన్ హోల్డర్‌ను లక్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ రూ. 8.75 కోట్లకు కొనుగోలు చేసుకుంది. ఇటీవల కాలంలో ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్న వాషింగ్టన్‌ సుందర్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ రూ. 8.75 కోట్లకు సొంతం చేసుకుంది.

 

అన్‌సోల్డ్‌

* మహమ్మద్ నబీ
* మ్యాథ్యూ వేడ్‌
* సాహా
* సామ్ బిల్లింగ్స్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని