Brook: ఐపీఎల్‌లో ఆడటం నా కల: హ్యారీ బ్రూక్‌

ఇటీవల జరిగిన ఐపీఎల్‌ 2023 మినీ వేలంలో ఇంగ్లాండ్‌ యువ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ను హైదరాబాద్‌ రూ.13.25 కోట్లతో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై స్పందించిన బ్రూక్‌ ఐపీఎల్‌లో ఆడటం తన కల అని పేర్కొన్నాడు.

Published : 24 Jan 2023 22:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌లో ఆడటం తన కల అని ఇంగ్లాండ్‌ యువ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్ ‌(Harry Brook) అన్నాడు. ఇటీవల ఐపీఎల్‌ మినీ వేలంలో హైదరాబాద్‌ రూ.13.25 కోట్లు వెచ్చించి బ్రూక్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.  పెద్ద మొత్తంతో హైదరాబాద్‌ ఫ్రాంచైజీ తనని కొనుగోలు చేయడం ఆశ్చర్యానికి గురిచేసిందని  పేర్కొన్నాడు. 

‘‘ఐపీఎల్‌ 2023కు నేను ఎంపిక అవుతానని ముందే ఊహించాను. కానీ హైదరాబాద్‌ అంత పెద్ద మొత్తం వెచ్చించడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఐపీఎల్‌లో ఆడటం నా కల. ఐపీఎల్‌లో చోటుతో పాటు డబ్బు బోనస్‌గా వచ్చింది. అయితే కేవలం డబ్బుతో నేను ప్రేరణ పొందను. క్రికెట్‌ అంటే నాకు అమితమైన అభిమానం. గొప్ప జట్ల తరఫున ఆడటం వల్ల నా బ్యాటింగ్‌ను మెరుగుపరుచుకోగలను’’ అని బ్రూక్‌ వెల్లడించాడు. 

హ్యారీ బ్రూక్‌ కోసం బెంగళూరు, రాజస్థాన్‌, హైదరాబాద్‌ ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి. అయితే చివరికి రూ.13.25 కోట్లతో సన్‌రైజర్స్‌ దక్కించుకుంది. బ్రూక్‌ రూ.1.5 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చాడు. బ్రూక్‌ కొనుగోలుపై ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్‌ డేవిడ్‌ హస్సీ కూడా అప్పట్లో కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్రూక్‌ను హైదరాబాద్‌ ఎక్కువగా అంచనా వేసిందని.. అతడిపై అంత ధర వెచ్చించాల్సింది కాదన్నాడు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని