Asia Cup: సెలబ్రిటీలే అక్కర్లేదు.. టీమ్‌వర్క్‌ చాలు..!

అందరి చూపు భారత్‌, పాకిస్థాన్‌ జట్లవైపే ఉన్న తరుణంలో.. ప్రతికూల పరిస్థితుల్లో బరిలో దిగిన శ్రీలంక ఆసియా కప్‌ను ఎగరేసుకుపోయింది.

Published : 13 Sep 2022 02:08 IST

లంక విజయంతో థ్రిల్‌ అయిన మహీంద్రా

దిల్లీ: అందరి చూపు భారత్‌, పాకిస్థాన్‌ జట్లవైపే ఉన్న తరుణంలో.. ప్రతికూల పరిస్థితుల్లో బరిలో దిగిన శ్రీలంక ఆసియా కప్‌ను ఎగరేసుకుపోయింది. ఫైనల్లో పాక్‌ను ఓడించి, ఆరోసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ సమయంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా చేసిన ట్వీట్ ఆలోచింపజేస్తోంది. 

‘శ్రీలంక సాధించిన విజయం నాకు థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఇది పాకిస్థాన్‌ ఓటమి వల్ల వచ్చింది కాదు. బృంద క్రీడల్లో విజయం సెలబ్రిటీలు, సూపర్‌ స్టార్‌లు ఉన్నారనేదాని కంటే.. కలిసికట్టుగా ఆడటంపైనే ఆధారపడి ఉంటుంది. శ్రీలంక విజయం ఇదే విషయాన్ని మనకు గుర్తు చేస్తోంది’ అని మహీంద్రా రాసుకొచ్చారు. 

టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ చేతిలో ఓడి ఏమాత్రం పోటీలో లేనట్లు కనిపించిన శ్రీలంక.. ఆ తర్వాత ఒక్కటీ ఓడలేదు. ఆదివారం జరిగిన ఫైనల్లో 23 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను మట్టికరిపించింది. సూపర్‌ బ్యాటింగ్‌తో భానుక రాజపక్స, ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో హసరంగ డిసిల్వా, మెరుపు బౌలింగ్‌తో ప్రమోద్‌ మదుషాన్‌ లంకను గెలిపించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని