Mohammad Azharuddin: ఆ ముగ్గురిపై చర్యలు తీసుకోండి : అజారుద్దీన్

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి సస్పెన్షన్‌కు గురైన ముగ్గురు మాజీ సభ్యులు విజయానంద్, జాన్ మనోజ్, నరేష్ శర్మ

Published : 28 Jan 2022 22:09 IST

హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి సస్పెన్షన్‌కు గురైన ముగ్గురు మాజీ సభ్యులు విజయానంద్, జాన్ మనోజ్, నరేష్ శర్మ.. జింఖానా గ్రౌండ్ కార్యాలయానికి వచ్చి విభేదాలు సృష్టిస్తున్నారని హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. క్రికెట్ అసోసియేషన్‌లో అనవసరంగా విభేదాలు సృష్టించి బోర్డు పరువు దిగజారుస్తున్నారంటూ మండిపడ్డారు. సుప్రీంకోర్టుకు వెళ్లినప్పటికీ అక్కడా వారికి చుక్కెదురైందని అజారుద్దీన్ ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని