
Published : 17 Oct 2021 01:45 IST
Dhoni: మరోసారి తండ్రి కాబోతున్న ధోని?
ఇంటర్నెట్ డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్‌కి ‘ఐపీఎల్-2021’ టైటిల్ ట్రోఫిని అందించి.. అభిమానులను ఉత్సాహపరిచిన ధోని మరో శుభవార్త వినిపించనున్నట్లు తెలుస్తోంది. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోని మరోసారి తండ్రి కానున్నట్లు నెట్టింట ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం సాక్షి నాలుగు నెలల గర్భవతి అని, 2022లో డెలివరీ కాబోతున్నట్లు క్రికెటర్ సురేశ్ రైనా భార్య ప్రియాంక చెప్పినట్లు ట్విటర్‌లో వినిపిస్తోంది. ఈ విషయంపై ధోని దంపతులు అధికారికంగా వెల్లడించలేదు. దుబాయ్‌లో ధోని టీమ్ విజయభేరీ మోగించిన అనంతరం స్టేడియం లోపలికి వచ్చి ధోనిని భార్య సాక్షి, కుమార్తె హత్తుకున్న దృశ్యాలు చూపురులను ఆకట్టుకుంటున్నాయి. 2010 జులై 4న ధోని-సాక్షి ప్రేమ వివాహంతో ఒకటైయ్యారు. 2015లో ఈ దంపతులకు జీవా పుట్టింది.
ఇవీ చదవండి
Tags :