IPL: బెరెన్‌డార్ఫ్‌ ఔట్.. ఇంగ్లాండ్‌ పేసర్‌కు ముంబయి ఇండియన్స్ పిలుపు

ఐపీఎల్‌ 2024 సీజన్‌ కోసం ముంబయి ఇండియన్స్‌ జాసన్ బెరెన్‌డార్ఫ్‌ స్థానంలో ఇంగ్లాండ్‌ లెప్టార్మ్‌ పేసర్‌ ల్యూక్ వుడ్‌ని జట్టులోకి తీసుకుంది.

Published : 18 Mar 2024 23:16 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ (IPL) 2024 సీజన్‌ ముంగిట ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians) జట్టులో చిన్న మార్పు చోటుచేసుకుంది. ఫాస్ట్‌ బౌలర్‌ జాసన్ బెరెన్‌డార్ఫ్‌ స్థానంలో ఇంగ్లాండ్‌ లెఫ్టార్మ్‌ పేసర్‌ ల్యూక్ వుడ్‌ని జట్టులోకి తీసుకుంది. బెరెన్‌డార్ఫ్‌ గాయం కారణంగా ఈ సీజన్‌ మొత్తానికి దూరమైన సంగతి తెలిసిందే. ల్యూక్‌ వుడ్‌ బేస్‌ ధర రూ.50 లక్షలు కాగా.. ఆ మొత్తానికి ముంబయి ఇండియన్స్‌ అతడితో ఒప్పందం కుదుర్చుకుంది. వుడ్‌ ఇప్పటివరకు 140 టీ20లు ఆడి 147 వికెట్లు పడగొట్టాడు. బీబీఎల్‌ (BBL), పీఎస్‌ఎల్ (PSL), బీపీఎల్ (BPL) వంటి టీ20 లీగ్‌ల్లో ఆడాడు. ఐపీఎల్‌లో మాత్రం అతడికిది మొదటి సీజన్‌. 

బెరెన్‌డార్ఫ్‌ దూరమవడం ముంబయి ఫాస్ట్‌బౌలింగ్‌ విభాగానికి కాస్త ఇబ్బంది కలిగించే అంశమే. అతడు గత సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడి 14 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు, శ్రీలంక పేసర్‌ దిల్షాన్‌ మధుశంక బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో గాయపడ్డాడు. దీంతో ఈ సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లకు అతడు దూరమయ్యే అవకాశముంది. మార్చి 24న గుజరాత్‌ టైటాన్స్‌తో ముంబయి ఇండియన్స్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని