Pak vs Eng: అరంగేట్రంలోనే అదరగొట్టిన పాక్‌ స్పిన్నర్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు

పాకిస్థాన్‌ యువ స్పిన్నర్‌ అబ్‌రర్‌ అహ్మద్‌ తన అరంగేట్రం టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనే సంచలన బౌలింగ్‌ ప్రదర్శన చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. పాక్‌, ఇంగ్లాండ్‌తో జరుగుతున్నరెండో టెస్టులో ఈ 24 ఏళ్ల స్పిన్నర్‌ మొదటి ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టాడు.

Published : 09 Dec 2022 21:21 IST

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌ యువ స్పిన్నర్‌ అబ్‌రర్‌ అహ్మద్‌ తన అరంగేట్రం టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనే సంచలన బౌలింగ్‌ ప్రదర్శన చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. పాక్‌, ఇంగ్లాండ్‌తో జరుగుతున్నరెండో టెస్టులో ఈ 24 ఏళ్ల స్పిన్నర్‌ మొదటి ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టాడు. విశేషం ఏంటంటే.. తొలి ఇన్నింగ్స్‌లో మొదటి ఐదు వికెట్లు అబ్‌రర్‌ పడగొట్టినవే. ఈ ఇన్నింగ్స్‌లో అతడు 22 ఓవర్లలో 114 పరుగులిచ్చి ఏడు వికెట్లు తీశాడు. ఈ క్రమంలోనే అరంగేట్రం టెస్టులో ఒక ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన మూడో బౌలర్‌గా నిలిచాడు. అంతేకాదు.. ఆడిన తొలి టెస్టులోనే ఐదు వికెట్లు తీసిన 13వ పాకిస్థాన్‌ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 

అబ్‌రర్‌ అహ్మద్‌ స్పిన్‌ ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 51.4 ఓవర్లలో 281 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలీ (19), డకెట్ ((63), ఓలీ పోప్‌ (60), జో రూట్ (8), హ్యారీ బ్రూక్‌ (9), బెన్‌ స్టోక్స్ (30), విల్ జాక్స్‌ (31)లను ఈ యువ స్పిన్నర్‌ పెలిలియన్‌కి పంపించగా..  జాహిద్ మహమూద్ 3 వికెట్లు పడగొట్టాడు. ఇక, ఈ మూడు టెస్టుల మ్యాచ్‌ల సిరీస్ విషయానికొస్తే.. రావల్పిండిలో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ 74 పరుగుల తేడాతో విజయం సాధించి 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. రెండో టెస్టులో ఎలాగైనా గెలుపొంది సిరీస్‌ను సమం చేయాలని పాక్‌ భావిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని