Ravi Shastri: రవిశాస్త్రి స్పెషల్ ఫొటో.. నెట్టింట మీమర్లకు పండగే!

రవిశాస్త్రి భారత ఆటగాడిగానే కాకుండా.. ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన క్రికెటర్. ఇప్పుడు తన కామెంట్రీతో అభిమానులను అలరిస్తున్నాడు. తాజాగా అతడు పెట్టిన ఫొటో వైరల్‌గా మారిపోయింది. 

Published : 10 Apr 2024 16:56 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత మాజీ ఆటగాడు రవిశాస్త్రి షేర్ చేసిన ఒక్క ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. టీమ్‌ఇండియాకు ప్రధాన కోచ్‌గా పనిచేసిన అతడు ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. రవిశాస్త్రి సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటాడు. ఈక్రమంలో ‘‘నేను చాలా ఆకర్షణీయం. నేనెంతో చిలిపి. ఇప్పుడు నేను సిక్ట్సీ’’ అని తన ఫొటోకు క్యాప్షన్‌ జోడించాడు. తన వయసుపైనా హాస్యభరితంగా స్పందించడం అభినందనీయమని పలువురు క్రికెట్ అభిమానులు సానుకూలంగా కామెంట్లు పెట్టారు. కొందరు మీమర్స్ తమ సరదా మీమ్స్‌తో పోస్టులు పెడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని