Rishabh Pant: రిషభ్ పంత్ మ్యాచ్‌ విన్నర్‌: దినేశ్ కార్తీక్‌

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియా వికెట్‌కీపర్‌ రిషభ్‌ పంత్‌ కీపింగ్‌లో రాణిస్తున్నప్పటికీ.. బ్యాటింగ్‌లో

Published : 01 Sep 2021 01:16 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియా వికెట్‌కీపర్‌ రిషభ్‌ పంత్‌ కీపింగ్‌లో రాణిస్తున్నప్పటికీ.. బ్యాటింగ్‌లో మాత్రం విఫలమవుతున్నాడు. ఇప్పటివరకు ఈ సిరీస్‌లో ఐదు ఇన్నింగ్స్‌లు ఆడిన పంత్.. 17.40 సగటుతో కేవలం 87 పరుగులు మాత్రమే చేసి విమర్శలపాలవుతున్నాడు. అయితే, ఈ సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌ల్లో పంత్‌ రాణిస్తాడని భారత క్రికెటర్‌ దినేశ్ కార్తీక్‌ విశ్వాసం వ్యక్తం చేశాడు.  బ్యాటింగ్‌ తీరులో రిషభ్ పెద్దగా మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదన్నాడు. ఈ సిరీస్‌లో భారత్‌  విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

‘ఆస్ట్రేలియా పర్యటనలో పంత్ మంచి ప్రదర్శన కనబరిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అతడికి కొంచెం సమయం  ఇచ్చి ఎదగడానికి సహకరించండి. సిరీస్‌ మధ్యలో రిషభ్‌.. తన బ్యాటింగ్‌ తీరులో పెద్దగా మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదని భావిస్తున్నా. ఇంగ్లాండ్‌లో ఎలా ఆడాలో అతడికి తెలుసు. పంత్ మ్యాచ్‌ విన్నర్‌. అతడు రాణిస్తాడనే నమ్మకం నాకుంది’ అని దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు.

ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య సెప్టెంబరు 2న ఓవల్‌ వేదికగా నాలుగో టెస్టు ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌లో మొదటి టెస్టు డ్రా అయింది. రెండో టెస్టులో కోహ్లీ సేన విజయం సాధించగా.. మూడో టెస్టులో ఇంగ్లాండ్ గెలుపొందడంతో సిరీస్‌ 1-1తో సమం అయింది.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని