Shoaib akthar: అస్వస్థతతో ఉంటేనే ఇలా ఆడారు.. ఫిట్‌గా ఉంటే ఏం చేసేవారో: షోయబ్ అక్తర్

పాకిస్థాన్‌తో తొలిరోజు టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ ఆటగాళ్ల దూకుడుపై షోయబ్‌ అక్తర్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

Updated : 02 Dec 2022 13:57 IST

రావల్పిండి: పాకిస్థాన్‌, ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌ రికార్డులకు నెలవైంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా రికార్డులను చెరిపేస్తూ తొలి రోజు టెస్టులో అత్యధిక పరుగులు సాధించిన ఘనతను ఇంగ్లాండ్‌ సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌ ముంగిట ఇంగ్లిష్‌ ఆటగాళ్లు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. కానీ, ఆ ప్రభావమేమీ వారి ఆటలో కనపడలేదు. గురువారం పాక్‌ ఆటగాళ్లపై విరుచుకుపడుతూ శతకాలు రాబట్టారు. తొలిరోజే అత్యధికంగా 506 పరుగులు సాధించారు. ఈ నేపథ్యంలో పాక్‌ మాజీ పేసర్‌  షోయబ్‌ అక్తర్‌ స్పందించాడు. ఇంగ్లాండ్‌ జట్టు అస్వస్థతకు గురైనప్పుడే ఇలా ఆడితే.. వారు బాగుంటే పరిస్థితి ఏమయ్యేదో అంటూ ట్వీట్‌ చేశాడు. 

‘‘ఇంగ్లాండ్‌ ఆటగాళ్లకు ఆరోగ్యం బాగాలేదా? అస్వస్థతతో ఉంటే ఇలా ఎవరైనా ఆడతారా? ఒకవేళ వారు పూర్తి ఫిట్‌గా ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో. ఇందులో మా కుర్రాళ్లను తప్పుపట్టడానికి ఏమీలేదు. ఎందుకంటే వారు టీ20 ఫాస్ట్‌ బౌలర్లు. టెస్టుల్లో వారింకా కుదురుకోవలసి ఉంది’’ అంటూ షోయబ్‌ వ్యాఖ్యానించాడు. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆరంభంలోనే 73 బౌండరీలు, మూడు సిక్సులతో ఇంగ్లాండ్‌ బ్యాటర్లు చెలరేగారు. టెస్టు సిరీస్‌లో వరుసగా 6 బౌండరీలు చేసిన ఆటగాడిగా బ్రూక్‌ నిలిచాడు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని