Shubman Gill: ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ ఫన్నీ వీడియో.. చూస్తే నవ్వు ఆగదు
టీమ్‌ఇండియా యువ క్రికెటర్లు ఇషాన్ కిషన్ (Ishan Kishan), శుభ్‌మన్ గిల్, చాహల్ కలిసి చేసిన ఓ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా యువ క్రికెటర్లు ఇషాన్ కిషన్ (Ishan Kishan), శుభ్‌మన్ గిల్ (Shubman Gill) మైదానంలో ఎంత దూకుడుగా ఆడతారో.. ఖాళీ సమయాల్లో అంతే సరదాగా ఉంటారు. గిల్, ఇషాన్ మంచి స్నేహితులు కూడా. అప్పుడప్పుడు వీరు చిన్న పిల్లల్లా అల్లరి చేస్తూ జట్టు సభ్యులను నవ్విస్తుంటారు. స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ఇషాన్ కిషన్‌లతో కలిసి చేసిన ఓ సరదా సన్నివేశాన్ని శుభ్‌మన్ గిల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు. MTVలో ప్రసారం అయ్యే పాపులర్ రియాల్టి షో ‘రోడీస్’.ఈ ముగ్గురు క్రికెటర్లు తమ హోటల్ గదిలో రోడీస్‌లా నటించారు. ఇషాన్ కిషన్, చాహల్ న్యాయ నిర్లేతలుగా వ్యవహరించగా.. గిల్ కంటెస్టెంట్‌గా నటించాడు. ఇషాన్ తన చేతులను కిందపెట్టి గెంతుతూ బెడ్‌పై కూర్చున్న గిల్ మీద నుంచి దూకుడుతాడు. అనంతరం గిల్‌ని పక్కకు తోసేస్తాడు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు కడుపుబ్బ నవ్వుకుంటున్నారు. మీరూ ఆ వీడియోని చూసి నవ్వుకోండి!
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Sukesh chandrasekhar: ‘నా బుట్టబొమ్మ జాక్వెలిన్‌కు’.. జైలు నుంచే సుకేశ్ మరో ప్రేమలేఖ
-
Movies News
celebrity cricket league: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ విజేత ‘తెలుగు వారియర్స్’
-
Ap-top-news News
‘నీట్’కు 17 ఏళ్ల కంటే ఒక్కరోజు తగ్గినా మేమేం చేయలేం: ఏపీ హైకోర్టు
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/03/2023)
-
Sports News
నిఖత్ కొట్టేయ్ మళ్లీ.. నేడు జరీన్ ఫైనల్
-
Movies News
భయపడితే.. కచ్చితంగా చేసేస్తా!