Rajasthan vs Delhi: మెరిసిన మార్ష్‌, డేవిడ్ వార్నర్‌.. రాజస్థాన్‌పై దిల్లీ సూపర్‌ విక్టరీ

టీ20 లీగ్‌లో ముప్పావువంతు మ్యాచ్‌లు ముగిశాయి. దీంతో టాప్‌-4ని నిలిచి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించేందుకు జట్లు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇదిలా ఉండగా.. రాజస్థాన్‌, దిల్లీ జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి.

Updated : 11 May 2022 23:34 IST

ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 161 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి 18.1 ఓవర్లలోనే ఛేదించింది. మిచెల్  మార్ష్‌ (89; 62 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లు), డేవిడ్ వార్నర్‌ (52*; 41 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకాలతో మెరిశారు. దిల్లీ మిగతా బ్యాటర్లలో శ్రీకర్‌ భరత్ (0) డకౌట్‌ కాగా.. రిషభ్‌ పంత్ (13*; 4 బంతుల్లో 2 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్‌ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీశారు. మిచెల్ మార్ష్‌ ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్’గా నిలిచాడు. అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్..  రవిచంద్రన్‌ అశ్విన్‌ (50), దేవదత్‌ పడిక్కల్ (48) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. రాజస్థాన్‌ మిగతా బ్యాటర్లలో యశస్వీ జైస్వాల్‌ (19), జోస్ బట్లర్‌ (7), సంజూ శాంసన్ (6), రియాన్ పరాగ్‌ (9), డస్సెన్ (12*), ట్రెంట్ బౌల్ట్‌ (3*) పరుగులు చేశారు. దిల్లీ బౌలర్లలో చేతన్‌ సకారియా, ఆన్రిచ్‌ నార్జ్‌, మిచెల్ మార్ష్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు. 


 దూకుడుగా ఆడుతున్న మిచెల్ మార్ష్‌.. దిల్లీ ఇంకా కొట్టాలంటే? 

దిల్లీ బ్యాటర్ మిచెల్ మార్ష్‌ దూకుడుగా ఆడుతున్నాడు. చాహల్‌ వేసిన 11వ ఓవర్‌లో ఓ సిక్సర్ బాదిన అతడు.. ప్రసిద్ధ్‌ కృష్ణ వేసిన 13 ఓవర్‌లో రెండు ఫోర్లు బాదాడు. 15 ఓవర్లకు దిల్లీ 114/1 స్కోరుతో ఉంది. డేవిడ్ వార్నర్‌ (38), మిచెల్ మార్ష్ (70) క్రీజులో ఉన్నారు. దిల్లీ విజయం సాధించాలంటే 30 బంతుల్లో 47 పరుగులు చేయాలి.


నిలకడగా ఆడుతున్న దిల్లీ

దిల్లీ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు.ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఆరో ఓవర్‌లో 10 పరుగులు రాగా.. కుల్‌దీప్‌ సేన్ వేసిన తర్వాతి ఓవర్‌లో మిచెల్‌ మార్ష్‌ రెండు సిక్సర్లు బాదారు. చాహల్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌లో 11 పరుగులు వచ్చాయి. 10 ఓవర్లకు దిల్లీ 74/1 స్కోరుతో ఉంది. డేవిడ్ వార్నర్‌ (23), మిచెల్ మార్ష్‌ (47) క్రీజులో ఉన్నారు.


 లక్ష్యఛేదనకు దిగిన దిల్లీ.. ఫస్ట్‌ వికెట్ డౌన్‌ 

 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీకి ఆదిలోనే షాక్‌ తగిలింది.ట్రెంట్ బౌల్ట్‌ వేసిన తొలి ఓవర్లో రెండె బంతికి శ్రీకర్‌ భరత్‌ (0)ఔటయ్యాడు. 4 ఓవర్లకు దిల్లీ 16/1 స్కోరుతో ఉంది. డేవిడ్ వార్నర్ (12),మిచెల్ మార్ష్‌ (3) క్రీజులో ఉన్నారు. 


 రాజస్థాన్‌ బ్యాటింగ్‌ పూర్తి.. దిల్లీ టార్గెట్ ఫిక్స్‌
 దిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ బ్యాటింగ్‌ పూర్తయింది. అశ్విన్‌ (50), దేవదత్‌ పడిక్కల్ (48) రాణించడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. రాజస్థాన్‌ మిగతా బ్యాటర్లలో యశస్వీ జైస్వాల్‌ (19), జోస్ బట్లర్‌ (7), సంజూ శాంసన్ (6), రియాన్ పరాగ్‌ (9), డస్సెన్ (12*), ట్రెంట్ బౌల్ట్‌ (3*) పరుగులు చేశారు. దిల్లీ బౌలర్లలో చేతన్‌ సకారియా, ఆన్రిచ్‌ నార్జ్‌, మిచెల్ మార్ష్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు. 


నిలకడగా ఆడుతున్న రాజస్థాన్‌.. క్రీజులో పడిక్కల్, సంజూ శాంసన్‌

రాజస్థాన్‌ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. కుల్‌దీప్‌ యాదవ్‌ వేసిన 12 ఓవర్‌లో అశ్విన్‌ ఓ సిక్సర్ బాదాడు. ఈ ఓవర్‌లో మరో ఐదు సింగిల్స్‌ వచ్చాయి. అక్షర్‌ పటేల్ వేసిన తర్వాతి ఓవర్‌లో పడిక్కల్ రెండు సిక్సర్లు బాదాడు. చేతన్ సకారియా వేసిన ఓవర్‌లో 10 పరుగులు వచ్చాయి. మిచెల్ మార్ష్‌ వేసిన 15వ ఓవర్‌లో తొలి బంతికి అశ్విన్‌ (50) డేవిడ్‌ వార్నర్‌కి చిక్కాడు. తర్వాత పడిక్కల్ రెండు ఫోర్లు బాదాడు. 15 ఓవర్లకు రాజస్థాన్‌ 116/3 స్కోరుతో ఉంది. పడిక్కల్‌ (37), శాంసన్‌ (1) క్రీజులో ఉన్నారు.  


రాజస్థాన్‌ రెండు వికెట్లు డౌన్‌.. సగం ఓవర్లు పూర్తి 
రాజస్థాన్‌ మరో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (19) ఔటయ్యాడు. మిచెల్ మార్ష్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌లో తొలి బంతికి లలిత్‌ యాదవ్‌కి చిక్కాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన దేవదత్  పడిక్కల్ రెండు ఫోర్లు బాదాడు. 10 ఓవర్లకు రాజస్థాన్‌ 68/2 స్కోరుతో ఉంది. అశ్విన్‌ (29), పడిక్కల్‌ (11) క్రీజులో ఉన్నారు.  


దూకుడుగా ఆడుతున్న అశ్విన్‌

రాజస్థాన్‌ తొలి వికెట్ కోల్పోయింది. భీకరమైన ఫామ్‌లో ఉన్న జోస్‌ బట్లర్‌ (7) ఔటయ్యాడు. చేతన్‌ సకారియా వేసిన మూడో ఓవర్‌లో అతడు శార్దూల్ ఠాకూర్‌కి చిక్కాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన రవిచంద్రన్‌ అశ్విన్‌ దూకుడుగా ఆడుతున్నాడు. నార్జ్‌ వేసిన నాలుగో ఓవర్‌లో యశస్వీ ఓ ఫోర్‌, సిక్స్‌ బాదాడు. శార్దూల్ ఠాకూర్‌ వేసిన ఐదో ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టిన రవిచంద్రన్ అశ్విన్‌.. అక్షర్‌ పటేల్ వేసిన తర్వాతి ఓవర్‌లో ఫోర్‌, సిక్సర్ బాదాడు.  6 ఓవర్లకు రాజస్థాన్‌ 43/1 స్కోరుతో ఉంది. అశ్విన్‌ (21), జైస్వాల్ (13) క్రీజులో ఉన్నారు.  


బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌

రాజస్థాన్‌, దిల్లీ జట్ల మధ్య మ్యాచ్‌ ప్రారంభమైంది. టాస్‌ గెలిచిన దిల్లీ బౌలింగ్‌ని ఎంచుకోవడంతో రాజస్థాన్ బ్యాటింగ్‌కు దిగింది. చేతన్‌ సకారియా వేసిన తొలి ఓవర్‌లో ఐదు పరుగులు రాగా.. నార్జ్‌ వేసిన తర్వాతి ఓవర్‌లోనూ ఐదు పరుగులు వచ్చాయి. రెండు ఓవర్లకు రాజస్థాన్ 10/0 స్కోరుతో ఉంది. బట్లర్ (7), యశస్వీ జైస్వాల్ (2) క్రీజులో ఉన్నారు.  


 టాస్ నెగ్గిన రిషభ్‌ పంత్

టీ20 లీగ్‌లో ముప్పావువంతు మ్యాచ్‌లు ముగిశాయి. దీంతో టాప్‌-4ని నిలిచి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించేందుకు జట్లు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇదిలా ఉండగా.. రాజస్థాన్‌, దిల్లీ జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన దిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్ తొలుత బౌలింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నాడు. జట్ల విషయానికొస్తే..ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్‌ 7 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. రిషభ్‌  పంత్ కెప్టెన్‌గా ఉన్న దిల్లీ జట్టు 11 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించి ఐదో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలుపొంది ప్లే ఆఫ్స్‌ అవకాశాలను మరింత మెరుగుపర్చుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. దీంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. 

రాజస్థాన్ జట్టు: యశస్వీ జైస్వాల్‌, జోస్‌ బట్లర్‌, సంజూ శాంసన్‌ (కెప్టెన్‌), దేవదత్ పడిక్కల్, డస్సెన్‌, రియాన్‌ పరాగ్, అశ్విన్‌, ట్రెంట్‌ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, చాహల్‌, కుల్‌దీప్‌ సేన్‌. 

దిల్లీ జట్టు: డేవిడ్ వార్నర్‌, శ్రీకర్‌ భరత్‌, మిచెల్ మార్ష్‌, రిషభ్‌ పంత్ (కెప్టెన్‌), లలిత్‌ యాదవ్‌, రోమన్‌ పావెల్, అక్షర్‌ పటేల్, శార్దూల్ ఠాకూర్‌, చేతన్‌ సకారియా, కుల్‌దీప్‌ యాదవ్‌, ఆన్రిచ్‌ నార్జ్‌. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని