
Captaincy : టీ20కెప్టెన్సీపై చేతన్ ప్రకటన.. దుమారం రేగే అవకాశం : ఆకాశ్ చోప్రా
ఇంటర్నెట్ డెస్క్: విరాట్ కోహ్లీ ‘కెప్టెన్సీ’ వ్యవహారంపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ ఇచ్చిన వివరణ మరోసారి దుమారం రేగే అవకాశం ఉందని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీని టీ20 సారథ్యం నుంచి తప్పుకోవద్దని బీసీసీఐ సహా తామంతా విజ్ఞప్తి చేశామని చేతన్ చెప్పుకొచ్చాడు. గతంలో విరాట్ చెప్పినదానికి, చేతన్ వివరణకు పొంతన లేకపోవడంతో ‘సారథ్యం’ వ్యవహారం మరోసారి చర్చనీయాంశం కానుంది. దీనిపై ఆకాశ్ చోప్రా విశ్లేషిస్తూ.. ‘‘కెప్టెన్సీ వ్యవహారంపై చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ వివరణ.. అగ్నికి కొంచెం ఆజ్యం పోసినట్లుగా ఉంది. ఈ క్రమంలో కోహ్లీ నుంచి స్పష్టత వచ్చే అవకాశం లేకపోలేదు. అయితే ఇది భారత క్రికెట్‌కు అంత మంచిది కాదు’’ అని వివరించాడు.
కొత్త ఏడాదిలో ఎలాంటి వివాదాలు లేకుండా ఉంటే బాగుండేదని, అయితే చేతన్ వివరణ తర్వాత చర్చకు దారితీసే అవకాశం ఉందని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ‘‘నూతన సంవత్సరం 2022లో టీమ్‌ఇండియా క్రికెట్‌కు సంబంధించి ఎటువంటి రూమర్లు, వివాదాలు ఉండకూడదు. అయితే మొన్న చేతన్ శర్మ చేసిన ప్రకటన తర్వాత దుమారం రేగొచ్చు. అలానే విరాట్ నుంచి కూడా ప్రతిచర్యగా వివరణ వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఇదే జరిగింది కూడానూ. ఒకరు (గంగూలీ) ఏదో చెప్పాడు. ఇతరుల నుంచి ఖండనలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ ఇలానే జరగొచ్చు’’ అని తెలిపాడు. గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు దూరమైన రోహిత్‌కు బదులు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా నియమితులయ్యాడు. వైస్ కెప్టెన్‌గా బుమ్రా వ్యవహరించనున్నాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.