MI vs CSK: ముంబయిపై చెన్నై ప్రతీకారం తీర్చుకోనుందా?
ఐపీఎల్లో విజయవంతమైన జట్లలో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ముందుంటాయి. ఈ రెండు జట్లూ తలపడే మ్యాచ్‌లకు మంచి ఆదరణ ఉంటుంది...
ఇంటర్నెట్‌డెస్క్: ఐపీఎల్లో విజయవంతమైన జట్లలో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ముందుంటాయి. ఈ రెండు జట్లూ తలపడే మ్యాచ్‌లకు మంచి ఆదరణ ఉంటుంది. కాగా, ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు మొత్తం 14 సీజన్లలో 32 మ్యాచ్‌లు జరగ్గా ముంబయి 19, చెన్నై 13 విజయాలు సాధించాయి. అయితే, ఐపీఎల్ 14వ సీజన్‌లోని మిగతా మ్యాచ్‌లు ఆదివారం నుంచి తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో నిర్వాహకులు ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌తోనే టోర్నీని తిరిగి కొనసాగిస్తున్నారు.
కరోనా వైరస్‌కు ముందు ఈ సీజన్ తొలి భాగంలో ముంబయి, చెన్నై జట్ల మధ్య ఎప్పటిలాగే ఓ హోరాహోరీ మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా ధోనీసేన నిర్దేశించిన 219 పరుగుల భారీ లక్ష్యాన్ని రోహిత్ టీమ్ ఛేదించింది. కీరన్ పొలార్డ్ దంచికొట్టడంతో ముంబయి ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ జరిగిన మూడు రోజులకే పలువురు ఆటగాళ్లు వైరస్ బారిన పడటంతో టోర్నీని నిరవధిక వాయిదా వేశారు. తిరిగి ఇప్పుడు యూఏఈలో నిర్వహిస్తున్న నేపథ్యంలో చెన్నై ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో కనిపిస్తోంది.
ఇప్పటికే ఈ లీగ్‌లో రెండో స్థానంలో కొనసాగుతున్న ధోనీసేన ఆదివారం ప్రారంభమయ్యే ముంబయి మ్యాచ్‌తోనే మరోసారి విజయపరంపరం కొనసాగించాలని చూస్తోంది. మరోవైపు టోర్నీ నిలిచిపోయేసరికి నాలుగో స్థానంలో నిలిచిన ముంబయి ఇండియన్స్ ప్లేఆఫ్స్ చేరాలంటే ప్రతి మ్యాచ్ కీలకమే. రెండో భాగంలో మిగిలిన జట్లు గట్టి పోటీ ఇచ్చే వీలుండటంతో ముంబయి జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. దీంతో తొలి మ్యాచ్‌లోనే మరోసారి చెన్నైను ఓడించాలనే పట్టుదలతో ఉంది.
ఇంతకుముందు ఏం జరిగింది..
తొలి భాగంలో 27వ మ్యాచ్‌లో తలపడిన రెండు జట్లు అభిమానులకు పసందైన వినోదం అందించాయి. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 218 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(4), సురేశ్ రైనా (2) విఫలమైనా.. డుప్లెసిస్(50; 28 బంతుల్లో 2x4, 4x6), మొయిన్ అలీ (58; 36 బంతుల్లో 5 x4, 5x6) రాణించారు. వీరిద్దరూ అర్ధశతకాలతో మెరవడంతో పాటు చివర్లో అంబటిరాయుడు (72; 27 బంతుల్లో 4x4, 7x6) మెరుపు బ్యాటింగ్ చేశాడు. రవీంద్ర జడేజా (22; 22 బంతుల్లో 2x2) సైతం వీలైనన్ని పరుగులు చేయడంతో చెన్నై భారీ స్కోర్ సాధించింది.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ముంబయి ఇండియన్స్ ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు రోహిత్ (35; 24 బంతుల్లో 4x4, 1x6), క్వింటన్ డికాక్(38; 28 బంతుల్లో 4x4, 1x6) శుభారంభం చేయగా తర్వాత వచ్చిన సూర్యకుమార్ కుమార్(4) విఫలమయ్యాడు. ఆపై కృనాల్ పాండ్య(32; 23 బంతుల్లో 2x4, 2x6), కీరన్ పొలార్డ్ (87 నాటౌట్; 34 బంతుల్లో 6x4, 8x6) ధాటిగా ఆడి కీలక పరుగులు చేశారు. మధ్యలో కృనాల్ ఔటైనా పొలార్డ్ చివరి వరకూ క్రీజులో నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో ముంబయి ఐపీఎల్లో భారీ లక్ష్య ఛేదన చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
ఐపీఎల్-2024లో రికార్డు ఛేజింగ్‌తో కోల్‌కతాపై పంజాబ్ భారీ విజయాన్ని నమోదు చేసింది. -
కావ్యా మారన్‌పై మీమ్స్.. విరాట్‌పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్‌కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్‌కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్‌కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్‌రేట్‌పై గావస్కర్
హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్‌లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్‌గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్‌లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో సన్‌రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్‌రౌండర్ గుల్బాదిన్ నయీబ్‌తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్‌రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్‌లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్‌లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటినుంచంటే?