Tokyo olympics: అర్జెంటీనాపై భారత హాకీ జట్టు గెలుపు

టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు మరో విజయాన్ని సొంతం చేసుకుంది.

Updated : 29 Jul 2021 08:07 IST

టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు మరో విజయాన్ని సొంతం చేసుకుంది. పూల్‌- ఏ నాలుగో మ్యాచ్‌లో అర్జెంటీనాపై గెలుపొందింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌పై భారత్‌ హాకీ జట్టు మూడో క్వార్టర్స్‌లో మొదటి గోల్‌ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ జరిగిన నాలుగో క్వార్టర్స్‌లో 2 గోల్స్‌ నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో 43వ నిమిషంలో భారత ఆటగాడు కుమార్ వరుణ్‌ తొలి గోల్‌ చేయగా.. 58వ నిమిషంలో ప్రసాద్‌ వివేక్‌సాగర్‌ రెండో గోల్‌ చేశాడు. 59వ నిమిషంలో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ మూడో గోల్‌ చేయడంతో 3-1 తేడాతో అర్జెంటీనాపై ఘన విజయం సాధించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని