
IPL 2021: ఐకానిక్ టీమ్.. ఔట్‌స్టాండింగ్ లీడర్: చెన్నైపై ప్రశంసల జల్లు
ఇంటర్నెట్‌డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ నాలుగోసారి ఐపీఎల్ ట్రోఫీ సాధించడంపై పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. చెన్నై అద్భుతమైన జట్టని, కెప్టెన్ మహేంద్రసింగ్ నాయకత్వం అమోఘమంటూ పొగడ్తల వర్షంలో ముంచెత్తారు. పలువురు టీమ్ఇండియా మాజీ క్రికెటర్లతో పాటు ప్రముఖులు సైతం సామాజిక మాధ్యమాల్లో చెన్నైని అభినందిస్తున్నారు. గతరాత్రి కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 27 పరుగులతో గెలుపొందిన సంగతి తెలిసిందే. దీంతో ముంబయి ఇండియన్స్ (5) తర్వాత అత్యధిక సార్లు టైటిల్ సాధించిన జట్టుగా ధోనీసేన నిలిచింది. గతేడాది పేలవ ఆటతీరుతో ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ప్లేఆఫ్స్‌కు చేరకుండా ఇంటిముఖం పట్టిన ఆ జట్టు ఈసారి ఏకంగా విజేతగా నిలవడం అందర్నీ ఆకట్టుకుంది. ముఖ్యంగా కెప్టెన్ ధోనీ గతేడాది పూర్తిస్థాయిలో విఫలమవ్వడంతో అతడి పనైపోయిందని అంతా అనుకున్నారు. కానీ, సింహం ఒకడుగు వెనక్కి వేస్తే రెండడుగులు ముందుకు దూకుతుందన్న చందంగా చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు విజేతగా నిలిచింది. దీంతో ధోనీ నాయకత్వంపై మళ్లీ ప్రశంసల జల్లు కురుస్తోంది.
ప్రముఖుల స్పందన..
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.