Tokyo Olympics: సింధు ముందుకు.. తరుణ్‌ వెనక్కి..

భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు ఒలింపిక్స్‌లో దూసుకుపోతోంది. గ్రూప్‌-జేలో జరిగిన రెండో పోరులో ఆమె సునాయాయ విజయం సాధించింది. హాంకాంగ్‌కు చెందిన చెంగ్‌ ఎంగన్‌ యిని 2-0 తేడాతో ఓడించింది....

Updated : 28 Jul 2021 15:11 IST

టోక్యో: భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు ఒలింపిక్స్‌లో దూసుకుపోతోంది. గ్రూప్‌-జేలో జరిగిన రెండో పోరులో ఆమె సునాయాస విజయం సాధించింది. హాంకాంగ్‌కు చెందిన చెంగ్‌ ఎంగన్‌ యిని 2-0 తేడాతో ఓడించింది. తొలి గేమ్‌ను 21-9తో కైవసం చేసుకున్న సింధు రెండో గేమ్‌లో కాసేపు శ్రమించాల్సి వచ్చింది. ప్రత్యర్థి పుంజుకొని పోటీనిచ్చింది. అయినప్పటికీ సింధు తన దూకుడు కొనసాగిస్తూ 21-16తో గేమ్‌తో పాటు మ్యాచును కైవసం చేసుకుంది.

ఆర్చీరీలో రాయ్‌ ఇంటికి

పురుషుల వ్యక్తిగత ఆర్చరీ పోటీల్లో తరుణ్‌దీప్‌ రాయ్‌ కథ ముగిసింది. ప్రిక్వార్టర్స్‌లో అతడు వెనుదిరిగాడు. ఇజ్రాయెల్‌కు చెందిన షానీ ఇటే చేతిలో 6-5 తేడాతో ఓటమి పాలయ్యాడు. ఒక పాయింటు తేడాతో అతడు వెనుదిరగడం గమనార్హం. నాలుగో సెట్లో 3-5తో వెనకబడిన అతడు ఐదోసెట్లో 5-5తో స్కోరు సమం చేశాడు. అయితే, షూటాఫ్‌లో షానీ 10కి గురిపెట్టగా తరుణ్‌దీప్‌ 9కి పరిమితం అయ్యాడు. అంతకు ముందు ఉక్రెయిన్‌ ఆర్చర్‌పై 6-4 తేడాతో రాయ్‌ విజయం సాధించడం గమనార్హం.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని