IND vs PAK: ‘కొన్నిరోజులైతే.. రిజ్వాన్‌, బాబర్‌ లాంటి ఆటగాళ్లు భారత్‌లో లేరంటారు’

పాకిస్థాన్‌ మాజీ సారథి రషీద్‌ లతీఫ్‌ భారతీయులను కించపరిచే విధంగా మాట్లాడాడు. ఇటీవల పాకిస్థాన్‌ జట్టులో ఓపెనర్లు మహ్మద్‌ రిజ్వాన్‌, బాబర్‌ అజామ్‌ అత్యద్భుత ప్రదర్శన చేస్తున్న సంగతి తెలిసిందే....

Updated : 19 Dec 2021 15:02 IST

పాకిస్థాన్‌ మాజీ సారథి రషీద్‌ లతీఫ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌ మాజీ సారథి రషీద్‌ లతీఫ్‌ భారతీయులను కించపరిచే విధంగా మాట్లాడాడు. ఇటీవల పాకిస్థాన్‌ జట్టులో ఓపెనర్లు మహ్మద్‌ రిజ్వాన్‌, బాబర్‌ అజామ్‌ అత్యద్భుత ప్రదర్శన చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో రాణిస్తూ అత్యధిక ఓపెనింగ్‌ శతక భాగస్వామ్యాల రికార్డు నెలకొల్పారు. ఈ క్రమంలోనే ఓ టీవీ ఛానెల్లో వారిద్దరినీ పొగిడిన లతీఫ్‌.. భారతీయులను తక్కువ చేసి మాట్లాడాడు.

‘ఏడాది క్రితం మనం పాకిస్థాన్‌ జట్టులో.. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ లాంటి ఆటగాళ్లు లేరని అనుకునేవాళ్లం. అయితే, మరికొన్ని రోజుల్లో భారతీయులు కూడా మా జట్టులో రిజ్వాన్‌, బాబర్‌ వంటి ఆటగాళ్లు లేరని అనుకుంటారు’ అని లతీఫ్‌ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. రిజ్వాన్‌, బాబర్‌, ఈ ఏడాది టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఓపెనింగ్‌ జంటగా నిలిచారు. అలాగే ఏడు శతక భాగస్వామ్యాలు నెలకొల్పి (రోహిత్‌-కేఎల్‌ రాహుల్‌ 6) రికార్డును బద్దలుకొట్టారు. ఈ క్రమంలోనే ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో రిజ్వాన్‌ 2 వేలకు పైగా పరుగులు చేయగా.. బాబర్‌ 1600కు పైగా పరుగులు చేశాడు. దీంతో వీరిద్దరూ ప్రపంచంలోనే మేటి ఓపెనర్లుగా రాణిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని