IND vs AUS : ఈ సిరీస్‌ అశ్విన్‌కు ట్రయల్‌ కాదు.. అవకాశం మాత్రమే: ద్రవిడ్‌

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌(IND vs AUS)కు అశ్విన్‌ను జట్టులోకి తీసుకోవడంపై హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌(Rahul Dravid) స్పందించాడు.

Updated : 22 Sep 2023 13:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మెగా టోర్నీ(ODI World Cup 2023) ముందు ఆస్ట్రేలియాతో భారత్‌ వన్డే సిరీస్‌(IND vs AUS)కు సిద్ధమైంది. ఆసియా కప్‌ గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉన్న రోహిత్‌ సేనకు.. తమను తాము పరీక్షించుకునేందుకు ఇది మరో అవకాశం. తొలి రెండు మ్యాచ్‌లకు సీనియర్లకు విశ్రాంతినిచ్చిన మేనేజ్‌మెంట్‌.. అక్షర్‌ పటేల్‌ గాయం కారణంగా వెటరన్‌ స్పిన్నర్‌ అశ్విన్‌(Ravichandran Ashwin)కు జట్టులో చోటు కల్పించింది. ఒకవేళ అక్షర్‌ కోలుకోకపోతే అశ్విన్‌ ప్రపంచకప్‌నకూ ఎంపికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతడి సత్తా నిరూపించుకునేందుకు ఈ సిరీస్‌ ఓ పరీక్షలాంటిదని పలువురు అంటున్నారు. దీనిపై హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌(Rahul Dravid) స్పందించాడు. ఇది అతడికి ట్రయల్‌ కాదని స్పష్టం చేశాడు.

కప్పు ముందు కంగారూలతో..

‘అశ్విన్‌ ఎంతో అనుభవమున్న ఆటగాడు. నంబర్‌ 8 స్థానంలో బ్యాటింగ్‌ చేస్తూ ఎంతో సహకారం అందిస్తున్నాడు. ఈ సిరీస్‌ అశ్విన్‌కు ట్రయల్‌ లాంటిది కాదు. ఈ ఫార్మాట్‌లో అతడికిది అవకాశం మాత్రమే’ అని ద్రవిడ్‌ వివరించాడు. ఇక అశ్విన్‌ చాలా కాలంగా వన్డేలకు దూరంగా ఉన్న విషయంపై స్పందిస్తూ..‘మా ప్రణాళికల్లో అతడు ఎప్పుడూ భాగమే. అతడు గత సంవత్సర కాలంగా ఎక్కువగా వన్డే క్రికెట్‌ ఆడలేదని తెలుసు. అయితే.. అతడు తన అనుభవంతో దాన్ని ఎదుర్కొంటాడు’ అని పేర్కొన్నాడు.

ఇక ఈ సిరీస్‌.. ఇటు ఇండియాతోపాటు ఆస్ట్రేలియాకు కూడా ఎంతో కీలకమే. వన్డే ప్రపంచకప్‌ ముందు తమ జట్టలోని లోటుపాట్లను సరిదిద్దుకునేందుకు ఇది మంచి అవకాశం. ఈ సిరీస్‌లో భాగంగా నేడు మొహాలిలో తొలి వన్డే జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని