టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయ్!
కరోనా కారణంగా స్టేడియాల్లో మ్యాచ్‌లను వీక్షించే అవకాశాన్ని కోల్పోయిన అభిమానులు తిరిగి క్రికెట్ సందడిని నేరుగా ఆస్వాదించడానికి సిద్ధమవుతున్నారు. భారత్×ఆస్ట్రేలియా మధ్య జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు
ఇంటర్నెట్‌డెస్క్: కరోనా కారణంగా స్టేడియాల్లో మ్యాచ్‌లను వీక్షించే అవకాశాన్ని కోల్పోయిన అభిమానులు తిరిగి క్రికెట్ సందడిని నేరుగా ఆస్వాదించడానికి సిద్ధమవుతున్నారు. భారత్×ఆస్ట్రేలియా మధ్య జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు టికెట్లను విక్రయించగా హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. ఆన్లైన్లో మూడు వన్డేలు, మూడు టీ20ల టికెట్లను ఉంచగా 24 గంట్లలోనే దాదాపు అన్నీ అమ్ముడుపోయాయి. తొలి వన్డేకు మాత్రం 2వేల టికెట్లు మిగిలాయి.
మహమ్మరి కారణంగా స్తంభించిన క్రికెట్ జులైలో తిరిగి ఆరంభమైన విషయం తెలిసిందే. అయితే ప్రేక్షకుల మధ్యలో మ్యాచ్‌లు జరగడం భారత్×ఆసీస్ తొలి వన్డేతోనే షురూ కానుంది. కాగా, కొవిడ్-19 జాగ్రత్తల నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం స్టేడియంలో 50 శాతం సామర్థ్యంతో అభిమానులకు అనుమతిచ్చింది. ‘‘భారత్×ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ అంటే ప్రపంచంలోనే అత్యంత ఆసక్తికరమైన పోటీ. ఈ సిరీస్ చరిత్రలో నిలిచిపోతుందని ఆశిస్తున్నా’’ అని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతినిధి ఆంథోని తెలిపారు. ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. వైట్ బాల్ క్రికెట్ సిరీస్‌లు సిడ్నీ, కాన్బెర్రాలో జరగనున్నాయి. సిడ్నీ వేదికగా నవంబర్ 27న తొలి వన్డే జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒక్కోసారి ‘వన్ పర్సెంట్’ ఛాన్స్ ఉన్నా చాలు..: విరాట్ కోహ్లీ
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరు జట్టు అద్భుతం చేసింది. ఊహించని విధంగా నాకౌట్‌కు చేరుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. -
వామ్మో.. అతడికి బౌలింగ్ చేయాలని ఎప్పుడూ కోరుకోను: పాట్ కమిన్స్
హైదరాబాద్ అద్భుతం చేసింది. ఐపీఎల్ 2024 సీజన్ ప్లేఆఫ్స్‌కు రెండో స్థానంతో దూసుకెళ్లింది. సొంతమైదానం ఉప్పల్ వేదికగా జరిగిన చివరి లీగ్‌లో పంజాబ్‌పై విజయం సాధించింది. -
దంచికొట్టి..దర్జాగా
అదే దూకుడు.. అదే దంచుడు. లక్ష్యం ఏమో 215. అయినా తమ ముందు అది చిన్నదే అంటూ.. సన్‌రైజర్స్ మరోసారి రెచ్చిపోయింది. -
సీఎస్కేను ఆపగలనని నమ్మా
చెన్నై సూపర్ కింగ్స్‌ని చివరి ఓవర్లో 17 పరుగులు చేయకుండా ఆపగలనని నమ్మానని.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ యశ్ దయాళ్ తెలిపాడు. -
ఒక్క బంతీ పడకుండానే..
ఐపీఎల్-17లో లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ వర్షార్పణం అయింది. -
ఛాంప్స్ సాత్విక్-చిరాగ్
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి అదరగొట్టారు. -
లీగ్ దశ ముగిసె..
పరుగుల వరద పారిన మ్యాచ్‌లు.. ఉత్కంఠభరితంగా ముగిసిన సమరాలు.. రికార్డుల మీద రికార్డులు! దాదాపు రెండు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్-17లో లీగ్ దశ ముగిసింది. -
ప్రసారదారుపై మండిపడ్డ రోహిత్
క్రికెటర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోందటూ ఐపీఎల్ ప్రసారదారుపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ మండిపడ్డాడు. -
ధోని ఆఖరి మ్యాచ్ ఆడాడని అనుకోవట్లేదు
దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్ ధోని తన కెరీర్లో చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడినట్లు తాను భావించట్లేదని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. -
‘లక్ష్య’ దీప్తి రికార్డు
ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి జీవాంజి దీప్తి (తెలంగాణ) సత్తాచాటింది. -
అర్జున్ గేమ్ డ్రా
షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ ఆటగాడు అర్జున్ ఇరిగేశి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. -
మను ఆధిపత్యం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్‌లో స్టార్ షూటర్ మను బాకర్ ఆధిపత్యం ప్రదర్శించింది. -
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు
స్టార్ స్పోర్ట్స్‌పై రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై మండిపడ్డాడు.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు.. లీగల్ యాక్షన్‌కు సిద్ధమైన పాయల్ రాజ్‌పుత్
-
రైసీ తర్వాత ఇప్పుడు అధికారం ఎవరు చేపడతారు..?
-
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం
-
కొనసాగుతోన్న ఐదో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది: ఎన్టీఆర్ గురించి ఈ సంగతులు తెలుసా?
-
మల్లారెడ్డి ఆస్తులపై విచారణ కోరతాం: ప్రభుత్వ విప్ లక్ష్మణ్‌కుమార్