టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడయ్యాయ్‌!

కరోనా కారణంగా స్టేడియాల్లో మ్యాచ్‌లను వీక్షించే అవకాశాన్ని కోల్పోయిన అభిమానులు తిరిగి క్రికెట్‌ సందడిని నేరుగా ఆస్వాదించడానికి సిద్ధమవుతున్నారు. భారత్‌×ఆస్ట్రేలియా మధ్య జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు

Published : 21 Nov 2020 01:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా కారణంగా స్టేడియాల్లో మ్యాచ్‌లను వీక్షించే అవకాశాన్ని కోల్పోయిన అభిమానులు తిరిగి క్రికెట్‌ సందడిని నేరుగా ఆస్వాదించడానికి సిద్ధమవుతున్నారు. భారత్‌×ఆస్ట్రేలియా మధ్య జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు టికెట్లను విక్రయించగా హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. ఆన్‌లైన్‌లో మూడు వన్డేలు, మూడు టీ20ల టికెట్లను ఉంచగా 24 గంట్లలోనే దాదాపు అన్నీ అమ్ముడుపోయాయి. తొలి వన్డేకు మాత్రం 2వేల టికెట్లు మిగిలాయి.

మహమ్మరి కారణంగా స్తంభించిన క్రికెట్‌ జులైలో తిరిగి ఆరంభమైన విషయం తెలిసిందే. అయితే ప్రేక్షకుల మధ్యలో మ్యాచ్‌లు జరగడం భారత్‌×ఆసీస్‌ తొలి వన్డేతోనే షురూ కానుంది. కాగా, కొవిడ్‌-19 జాగ్రత్తల నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం స్టేడియంలో 50 శాతం సామర్థ్యంతో అభిమానులకు అనుమతిచ్చింది. ‘‘భారత్×ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌ అంటే ప్రపంచంలోనే అత్యంత ఆసక్తికరమైన పోటీ. ఈ సిరీస్‌ చరిత్రలో నిలిచిపోతుందని ఆశిస్తున్నా’’ అని క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రతినిధి ఆంథోని తెలిపారు. ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటనలో భారత్‌ మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. వైట్‌ బాల్ క్రికెట్‌ సిరీస్‌లు సిడ్నీ, కాన్‌బెర్రాలో జరగనున్నాయి. సిడ్నీ వేదికగా నవంబర్‌ 27న తొలి వన్డే జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని