Tokyo Olympics: దీపక్‌ పునియా విదేశీ కోచ్‌పై వేటు

కుస్తీ ఆటగాడు దీపక్‌ పునియా విదేశీ కోచ్‌ మురాద్‌ గైదరోవ్‌పై వేటు పడింది. రెఫరీపై దాడిని తీవ్రంగా పరిగణించిన ఇంటర్నేషనల్‌ ఒలింపిక్‌ కమిటీ (ఐవోసీ).. ఆయన అక్రిడిటేషన్‌ను రద్దు  చేసింది. తక్షణమే ఒలింపిక్‌ క్రీడాగ్రామాన్ని వదలివెళ్లేలా ఆదేశించాలని

Published : 06 Aug 2021 23:57 IST

రెఫరీపై దాడి నేపథ్యంలో ఐఓసీ క్రమశిక్షణ చర్య

ఇంటర్నెట్‌ డెస్క్‌: కుస్తీ ఆటగాడు దీపక్‌ పునియా విదేశీ కోచ్‌ మురాద్‌ గైదరోవ్‌పై వేటు పడింది. రెఫరీపై దాడిని తీవ్రంగా పరిగణించిన ఇంటర్నేషనల్‌ ఒలింపిక్‌ కమిటీ (ఐవోసీ).. ఆయన అక్రిడిటేషన్‌ను రద్దు  చేసింది. తక్షణమే ఒలింపిక్‌ క్రీడాగ్రామాన్ని వదలివెళ్లేలా ఆదేశించాలని భారత ఒలింపిక్‌ జట్టుకు సూచించింది. కాంస్య పోరులో భాగంగా గురువారం పునియా.. శాన్‌ మారినోకు చెందిన మైల్స్‌ నాజిమ్‌ అమైన్‌ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో కోచ్‌ గైదరోవ్‌ మ్యాచ్‌ అనంతరం రెఫరీ గదికి వెళ్లి ఆయనపై దాడికి పాల్పడ్డారు.  ప్రపంచ రెజ్లింగ్‌ విభాగం(ఎఫ్ఐఎల్‌ఏ) శుక్రవారం ఈ విషయాన్ని ఇంటర్నేషనల్‌ ఒలింపిక్‌ కమిటీ (ఐవోసీ) దృష్టికి తీసుకెళ్లింది. భారత రెజ్లింగ్‌ సమాఖ్య(డబ్ల్యూఎఫ్‌ఐ)ను విచారణకు పిలిపించింది.  సమాఖ్య క్షమాపణ చెప్పడంతో.. హెచ్చరించి వదిలేసింది. గైదరోవ్‌పై ఎటువంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించగా.. అతడిని తొలగించినట్లు డబ్ల్యూఎఫ్‌ఐ తెలిపింది.  సదరు కోచ్‌ గతంలోనూ ఈ తరహా దుశ్చర్యకు పాల్పడిన నేపథ్యంలో.. కఠిన చర్యలు తీసుకోవాలని ఎఫ్‌ఐఎల్‌ఏ కోరగా.. అక్రిడిటేషన్‌ రద్దు చేసింది.

‘డబ్ల్యూఎఫ్‌ఐ నిషేధానికి గురయ్యేది’

డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ‘ఇది చాలా తీవ్రమైన అంశం. విచారణ సమయంలో మమ్మల్ని ఏదో ఒకలా వదిలేశారు.. లేదా ఫెడరేషన్‌ నిషేధాన్ని ఎదుర్కొవాల్సి వచ్చేద’ని పేర్కొన్నారు. రష్యాకు చెందిన మురాద్‌.. క్రీడాకారుడిగా 2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌లోనూ క్వార్టర్‌ ఫైనల్‌లో ఓడిపోయినప్పుడు ప్రత్యర్థిపై దాడికి పాల్పడి డిస్‌ క్వాలిఫై అయ్యాడు.  2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో మాత్రం రజతం సాధించడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని