Cyber Crime: సైబర్‌ మోసానికి గురైన మాజీ క్రికెటర్‌!

సైబర్‌ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సైబర్‌ నేరాలపై పెద్దగా అవగాహన లేని సామాన్య ప్రజలతో పాటు.. ప్రముఖులు సైతం ఇలాంటి మోసాలకు గురవుతున్నారు. తాజాగా మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీ ఇలానే రూ.లక్ష పోగొట్టుకున్నారు. అయితే, సమయానికి పోలీసులకు ఫిర్యాదు

Published : 11 Dec 2021 01:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆన్‌లైన్‌ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సైబర్‌ నేరాలపై పెద్దగా అవగాహన లేని సామాన్య ప్రజలతో పాటు.. ప్రముఖులు సైతం ఇలాంటి మోసాలకు గురవుతున్నారు. తాజాగా మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లి ఇలానే సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కి రూ.లక్ష పోగొట్టుకున్నారు. అయితే, సమయానికి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ నగదు తిరిగి తన బ్యాంక్‌ ఖాతాలోకి వచ్చి చేరింది.

డిసెంబర్‌ 3న వినోద్‌ కాంబ్లికి బ్యాంక్‌ అధికారినంటూ ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. కేవైసీ వివరాలు అప్‌డేట్‌ చేయాలని, లేనిపక్షంలో డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు డీయాక్టివేట్‌ అవుతాయని చెప్పాడు. కేవైసీ అప్‌డేట్‌ చేయడం కోసం అతడు చెప్పిన విధంగా కాంబ్లి తన మొబైల్‌లో ‘ఎనీ డెస్క్‌’యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేశారు. అంతే.. తన బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి పలు దఫాలుగా రూ.1.14 లక్షలు మరో అకౌంట్‌కి బదిలీ అయ్యాయి. బ్యాంక్‌ అధికారినంటూ ఫోన్‌ చేసిన సైబర్‌ నేరగాడు ‘ఎనీ డెస్క్‌’ యాప్‌ ద్వారా కాంబ్లి ఫోన్‌ను యాక్సెస్‌ చేసి నగదు బదిలీ చేసుకున్నాడు.

ఫోన్‌ సంభాషణ పూర్తయిన తర్వాత తన అకౌంట్‌లో నుంచి డబ్బులు బదిలీ కావడం గమనించిన కాంబ్లి.. బాంద్రా పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బ్యాంక్‌ అధికారులను సంప్రదించారు. కాంబ్లి అకౌంట్‌ నుంచి ఏ అకౌంట్‌లోకి డబ్బులు బదిలీ అయ్యాయో తెలుసుకొని, రివర్స్‌ ట్రాన్సక్షన్‌ ద్వారా ఆ డబ్బును తిరిగి ఆయన ఖాతాలోనే జమ చేశారు. పోయిన డబ్బు తిరిగి రావడంతో కాంబ్లి ఊపిరి పీల్చుకున్నారు. అందుకే, ఎవరైనా సైబర్‌ మోసానికి గురైన వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సైబర్‌ నిపుణులు సూచిస్తుంటారు. అలా చేస్తే పోగొట్టుకున్న డబ్బు తిరిగి లభించే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.

Read latest Crime News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని