Virat Kohli: ఒక్కో పోస్టుకు రూ. 11.45 కోట్లు.. స్పందించిన విరాట్ కోహ్లీ

ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కలిగిన విరాట్ కోహ్లీ (Virat Kohli) సంపాదన విషయంలోనూ ముందుంటాడు. క్రికెట్‌, క్రికెటేతర మార్గాల ద్వారా భారీ మొత్తమే ఆర్జిస్తున్నట్లు తాజాగా ఓ సంస్థ వెల్లడించింది. అయితే, అలాంటి వార్తలపై విరాట్ స్పందించాడు.

Updated : 12 Aug 2023 11:59 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సామాజిక మాధ్యమాల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన క్రికెటర్‌ విరాట్ కోహ్లీ (Virat Kohli). అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో పోస్టుకు రూ. 11.45 కోట్లు ఆర్జిస్తాడనే వార్తలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ జాబితాలో టాప్‌-25లో ఉన్న ఏకైక భారతీయుడు కోహ్లీనేనని హాపర్ హెచ్‌ క్యూ అనే సంస్థ వెల్లడించింది. అయితే, తాను చేసే పోస్టుపై వచ్చే సంపాదన గురించి  తాజాగా విరాట్ కోహ్లీ స్పందించాడు. అందులో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేశాడు.

అడ్రస్‌ అడిగిన ధోని.. నెట్టింట వీడియో వైరల్‌

‘‘నా జీవితంలో ఇప్పటి వరకు నేను అందుకొన్న ప్రతి దానికి రుణపడి ఉంటాను. అందుకోసం ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఇప్పుడు చక్కర్లు కొడుతున్న ‘సోషల్‌ మీడియా సంపాదన’ వార్తల్లో ఎలాంటి నిజం లేదు’’ అని కోహ్లీ ట్వీట్ చేశాడు.

హాపర్ హెచ్‌క్యూ ఏం చెప్పిందంటే? 

ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే విరాట్ ఖాతాను ఏకంగా 256 మిలియన్ల (25 కోట్లకు పైగా) మంది అనుసరిస్తున్నారు. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీకి డిమాండ్‌ చాలా ఎక్కువ. ఇన్‌స్టాగ్రామ్‌లో  ఖరీదైన అథ్లెట్ల జాబితాలో కోహ్లీ మూడో స్థానంలో నిలిచాడని సామాజిక మాధ్యమాల వ్యాపార నిర్వహణ వేదిక హాపర్‌ హెచ్‌క్యూ వెల్లడించింది. ఒక్కో పోస్టుకు అతడు రూ.11.45 కోట్ల చొప్పున తీసుకుంటున్నాడని తెలిపింది. ఫుట్‌బాల్‌ దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో (599 మిలియన్‌), మెస్సి (482 మిలియన్‌) మాత్రమే కోహ్లీ కంటే ముందున్నారు. ఒక్కో పోస్టు కోసం రొనాల్డో రూ.26.76 కోట్లు, మెస్సి రూ.21.49 కోట్లు వసూలు చేస్తున్నారు. ఇటీవల స్పోర్టికో వెల్లడించిన అత్యధిక జీతం పొందే ప్రపంచంలోని టాప్‌-100 అథ్లెట్ల జాబితాలోనూ కోహ్లీకి స్థానం దక్కింది. కోహ్లీ నికర విలువ   రూ.1000 కోట్లకు పైనే ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు