Virat Kohli : మరో పరుగు చేస్తే హాఫ్‌ సెంచరీ.. డీకేతో కోహ్లీ ఏమన్నాడంటే..

71 అంతర్జాతీయ సెంచరీలతో దూసుకుపోతున్న రన్‌ మెషీన్‌ కోహ్లీ.. ఎప్పుడూ వ్యక్తిగత రికార్డుల కోసం ఆడలేదు. జట్టుకు ఏది ఉత్తమమో.. అదే చేస్తాడు.

Published : 04 Oct 2022 01:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ :  కింగ్‌ కోహ్లీ పరుగుల దాహం తీరనిది అన్న విషయం మనకు తెలిసినదే. పరుగుల వేటలో ఎన్నో రికార్డులు అతడికి దాసోహం అయ్యాయి. 71 అంతర్జాతీయ సెంచరీలతో దూసుకుపోతున్న ఈ రన్‌ మెషీన్‌.. ఎప్పుడూ వ్యక్తిగత రికార్డుల కోసం ఆడలేదు. జట్టుకు ఏది ఉత్తమమో.. అదే చేస్తాడు. ఇలాంటి ఘటనే దక్షిణాప్రికాతో జరిగిన రెండో టీ20లో చోటుచేసుకుంది. ఇంకో పరుగు సాధిస్తే అర్ధ శతకం నమోదు చేసే అవకాశం ఉన్నా.. తన నిస్వార్థతను ప్రదర్శించాడు కోహ్లీ.

అది చివరి ఓవర్‌.. విరాట్‌ 28 బంతుల్లో 49 పరుగులతో ఆడుతున్నాడు. బెస్ట్‌ ఫినిషర్‌గా పేరున్న దినేశ్‌ కార్తిక్‌ స్ట్రైకింగ్‌లోకి వచ్చాడు. మొదటి నాలుగు బంతులాడిన డీకే.. ఒక ఫోర్‌, సిక్స్‌తో పది పరుగులు రాబట్టాడు. చివరి రెండు బంతులు మిగిలి ఉండగా.. నాన్‌ స్ట్రైక్‌లో ఉన్న కోహ్లీ వద్దకు వెళ్లి స్ట్రైక్‌ కావాలా.. అని అడిగాడు. మరో పరుగు చేస్తే కోహ్లీ హాఫ్‌ సెంచరీ పూర్తవుతుంది. అయితే.. జట్టు కోసం బ్యాట్‌తో పని పూర్తి చేయ్‌ అని డీకేకు చెప్పి కోహ్లీ వెంటనే వెనక్కి తిరిగాడు. ఆ తర్వాతి బంతికే కార్తిక్‌ సిక్స్‌తో విరుచుకుపడ్డాడు. దీంతో భారత్‌ 3 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. చివరి ఓవర్లో డీకే, కోహ్లీ మధ్య సంభాషణ వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో పంచుకుంది. ‘పరుగుల పండగకు అదనం.. ఇదో ప్రత్యేక క్షణం’ అంటూ పేర్కొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని