Rohit - Virat - Dhawan : టాప్‌ ఆర్డర్‌ వైఫల్యంపై భారత మాజీ ఆటగాడి అద్భుత విశ్లేషణ

ఇంగ్లాండ్‌తో సిరీస్‌ను తేల్చే మూడో వన్డేలో భారత టాప్‌ ఆర్డర్‌ ఘోరంగా విఫలమైంది. ఇంగ్లాండ్ బౌలర్ల దెబ్బకు 72/4 కుదేలైన టీమ్‌ఇండియాను ...

Published : 20 Jul 2022 01:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఇంగ్లాండ్‌తో సిరీస్‌ను తేల్చే మూడో వన్డేలో భారత టాప్‌ ఆర్డర్‌ ఘోరంగా విఫలమైంది. ఇంగ్లాండ్ బౌలర్ల దెబ్బకు 72/4 కుదేలైన టీమ్‌ఇండియాను రిషభ్‌ పంత్ (125*), హార్దిక్‌ పాండ్య (71) గెలిపించారు. దీంతో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకొంది. అంతకుముందు రెండో వన్డే మ్యాచ్‌లోనూ ఇదే తరహాలో టాప్‌-4 బ్యాటర్లు తడబడ్డారు. రెండు మ్యాచుల్లో కలిపి రోహిత్ శర్మ (0, 17), శిఖర్ ధావన్‌ (9, 1), విరాట్ కోహ్లీ (16, 17), సూర్యకుమార్‌యాదవ్ (27, 16) చెప్పుకోదగ్గ స్కోర్లు నమోదు చేయలేదు. ఈ క్రమంలో టీమ్‌ఇండియా టాప్‌ఆర్డర్‌ వైఫల్యంపై మాజీ ఆటగాడు వసీం జాఫర్ తనదైన శైలిలో స్పందించాడు. 

‘‘గత రెండు వన్డేలు మినహా మిగతా అన్నిసార్లూ టాప్‌ఆర్డర్‌ ఆడితే భారత్‌ అద్భుతంగా రాణించింది. అయితే ఇంగ్లాండ్‌తో మూడో వన్డేలో మిడిలార్డర్‌ ఆదుకోవడంతో సిరీస్‌ను నెగ్గింది. టాప్‌ ఆర్డర్‌లో విరాట్ కోహ్లీ తన ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. శిఖర్‌ ధావన్‌ సరైన ప్రాక్టీస్‌ లేనట్టుగా ఆడాడు. ఇక రోహిత్ శర్మ అయితే అతడి దగ్గర నుంచి ఆశించిన స్థిరత్వం కొరవడింది. టాప్‌ఆర్డర్‌ వైఫల్యం చెందడం ఆందోళనకరమే కానీ.. అయిదు, ఆరు, ఏడో స్థానంలో వచ్చిన వారు గత మ్యాచ్‌లో మాదిరిగా రాణిస్తే రోహిత్ శర్మకు అంతకంటే ఆనందం కలిగించే మరొకటి ఉండదు’’ అని జాఫర్‌ వ్యాఖ్యానించాడు. ఇక ఎనిమిదో స్థానంలో వచ్చే బ్యాటర్‌ కూడా ఆల్‌రౌండర్‌ అయితే టీమ్‌ఇండియాకు అదనపు బలంగా మారే అవకాశం ఉందని వివరించాడు. దాని కోసం శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌ వంటి ఆటగాళ్లు ఉన్నారని జాఫర్‌ తెలిపాడు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని