Tokyo Olympics: కండోమ్‌ సాయంతో ఒలింపిక్స్‌లో స్వర్ణం

ఆస్ట్రేలియాకు చెందిన 27 ఏళ్ల జెస్సికా ఫాక్స్.. ఈ వారంలో జరిగిన క్యానో స్రింట్‌ స్లాలోమ్‌ సీ1 విభాగంలో అందర్నీ ఓడించి స్వర్ణ పతకం సాధించింది. అలాగే క్యానో స్లాలామ్‌ కె1 ఫైనల్‌లోనూ కాంస్యం సాధించింది.

Published : 31 Jul 2021 01:06 IST

ఆస్ట్రేలియా క్యానో స్ర్పింట్‌ జెస్సికా ఫాక్సీ ఏం చెప్పిందంటే?

ఇంటర్నెట్‌ డెస్క్‌: టోక్యో ఒలింపిక్స్‌లో ఒక క్రీడాకారిణి స్వర్ణ పతకం సాధించడం వెనుక కండోమ్‌ కీలక పాత్ర పోషించిందంటే నమ్ముతారా? ఈ క్రీడల్లో క్యానో స్ప్రింట్‌ అనే ఒక విభాగం కూడా ఉంది. నీటిపై కయాకింగ్‌ చేయడమే ఈ ఈవెంట్‌ ప్రత్యేకత. ఆస్ట్రేలియాకు చెందిన 27 ఏళ్ల జెస్సికా ఫాక్స్.. ఈ వారంలో జరిగిన క్యానో స్ప్రింట్‌ స్లాలోమ్‌ సీ1 విభాగంలో అందర్నీ ఓడించి స్వర్ణ పతకం గెలుచుకుంది. అలాగే క్యానో స్లాలామ్‌ కె1 ఫైనల్‌లోనూ కాంస్యం సాధించింది. అయితే, ఇదంతా ఒక కండోమ్‌ సాయంతోనే జరిగిందని ఆమె అంటోంది. అందుకు సంబంధించిన వీడియోను సైతం సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. 

క్యానో స్ప్రింట్‌ పోటీల్లో కయాకింగ్‌ ఒకటి. సన్నగా ఉండే పడవలో కేవలం ఒకరు మాత్రమే కూర్చొని తన శక్తి సామర్థ్యాలతో సరస్సులు, లేదా నదులపై ముందుకు సాగుతారు. అయితే, ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న జెస్సికాకు అనుకోకుండా ఒక అవాంతరం ఏర్పడింది. తన పడవ మరమ్మతుకు గురైంది. ఈ క్రమంలోనే దాన్ని సరిదిద్దేందుకు కార్బన్‌ మిశ్రమాన్ని ముందు భాగంలో అదిమిపెట్టి తర్వాత నీటిలో అది తొలగిపోకుండా ఉండేందుకు స్మూత్‌ ఫినిషింగ్‌ కోసం కండోమ్‌ని వాడినట్టు ఆమె చెప్పింది. అలా తన విజయానికి ఆఖరి నిమిషంలో కండోమ్‌ ఉపయోగపడిందని చెప్పుకొచ్చింది. దీంతో పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నట్లు పేర్కొంది. మరోవైపు ఆ పడవ రిపేర్‌కు సంబంధించి ఆ కండోమ్‌ని ఎలా వాడారో తెలియజేసే వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని