షారుఖ్‌కి పెద్ద అభిమానిని.. వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

వెస్టిండీస్‌ స్టార్‌ ఆల్ రౌండర్‌ జేసన్‌ హోల్డర్‌ పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. సరదా సంభాషణలో భాగంగా తన అభిమాన బాలీవుడ్‌...

Published : 11 Mar 2022 21:56 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వెస్టిండీస్‌ స్టార్‌ ఆల్ రౌండర్‌ జేసన్‌ హోల్డర్‌ పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. సరదా సంభాషణలో భాగంగా తన అభిమాన బాలీవుడ్‌ నటుడు ఎవరో చెప్పేశాడు. ‘షారుఖ్‌ ఖాన్‌ నా ఫేవరెట్ యాక్టర్‌. ఎందుకంటే.. గతంలో నేను ఆడిన కోల్‌కతా జట్టుకు అతడే యజమాని’ అని పేర్కొన్నాడు. అలాగే, భారతీయ వంటకాల్లో ‘భిండి’ అంటే చాలా ఇష్టమని హోల్డర్‌ చెప్పాడు.

ఇటీవల ముగిసిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (ఐపీఎల్) మెగా వేలంలో హోల్డర్‌ని.. లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ (ఎల్‌ఎస్జీ) జట్టు యాజమాన్యం రూ.8.75 కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. హోల్డర్ గతంలో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌), కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) జట్ల తరఫున ఆడాడు. మార్చి 26 నుంచి ఐపీఎల్-2022 సీజన్‌ ప్రారంభం కానుంది. మార్చి 28న ముంబయిలోని వాంఖడే స్టేడియంలో లఖ్‌నవూ, గుజరాత్ టైటాన్స్‌ జట్ల తలపడనున్నాయి. లఖ్‌నవూ, గుజరాత్ జట్లు ఈ సీజన్‌ నుంచే కొత్తగా ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని