West Indies: ఓటమి బాధలో ఉన్న వెస్టిండీస్‌కు మరో షాక్‌

జింబాబ్వే చేతిలో ఓటమిపాలై బాధలో ఉన్న వెస్టిండీస్‌ (West Indies)కు ఐసీసీ మరో షాక్‌ ఇచ్చింది. స్లో రేట్‌ మెయిన్‌టేన్‌ చేసిందుకు మ్యాచ్‌ ఫీజులో 60 శాతం కోత విధించింది. 

Published : 25 Jun 2023 19:09 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్‌ క్వాలిఫయర్స్‌లో వెస్టిండీస్‌కు జింబాబ్వే షాక్‌ ఇచ్చింది. ఆ ఓటమి బాధ నుంచి తేరుకునేలోపే విండీస్‌కు మరో షాక్‌ తగిలింది. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో స్లో రేట్‌ మెయిన్‌టైన్‌ చేసినందుకు ఆ జట్టు మ్యాచ్‌ ఫీజులో 60 శాతం కోత పడింది. నిర్ణీత సమయంలోపు మూడు ఓవర్లు తక్కువగా వేసినందుకు ఓవర్‌కు 20 శాతం చొప్పున ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులో 60 శాతం కోత విధించారు. కెప్టెన్‌ షైయ్‌ హోప్‌ తప్పును, జరిమానాలను అంగీకరించడంతో ఎలాంటి అధికారిక విచారణ ఉండదు.

శనివారం జింబాబ్వే చేతిలో వెస్టిండీస్ 35 పరుగులతో అనూహ్య ఓటమి చవిచూసింది. మొదట సికిందర్‌ రజా (68), ర్యాన్‌ బర్ల్‌ (50), క్రెయిగ్‌ ఎర్విన్‌ (47) రాణించడంతో జింబాబ్వే 268 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం చటార (3/52), సికిందర్‌ రజా (2/36), ఎంగరవ (2/25), ముజరబాని (2/33)ల ధాటికి విండీస్‌ 44.4 ఓవర్లలో 233 పరుగులకే ఆలౌటైంది. కైల్‌ మేయర్స్‌ (56), చేజ్‌ (44), పూరన్‌ (34) మినహా బ్యాటర్లు విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌ ఓడినప్పటికీ.. తొలి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గడంతో విండీస్‌ సూపర్‌-6కు అర్హత సాధించింది. జింబాబ్వే, నెదర్లాండ్స్‌ కూడా గ్రూప్‌-ఎ నుంచి ముందంజ వేశాయి. నేపాల్‌, అమెరికా సూపర్‌-6 రేసుకు దూరమయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని