IND Vs SA : పంత్‌, కార్తిక్‌లిద్దరికీ మరోసారి అవకాశం కల్పిస్తారా..?

టీ20 ప్రపంచకప్‌ ముంగిట ఈ సిరీస్‌ విజయం టీమ్‌ఇండియాకు ఎంతో ముఖ్యం. ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్‌.. ఇంకో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది.

Updated : 02 Oct 2022 11:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ :  దక్షిణాఫ్రికాపై తొలి టీ20లో ఘన విజయంతో మంచి జోష్‌ మీదున్న రోహిత్‌ సేన నేడు జరగనున్న రెండో మ్యాచ్‌లోనూ విజయంతో దూసుకెళ్లాలని చూస్తోంది. టీ20 ప్రపంచకప్‌ ముంగిట ఈ సిరీస్‌ విజయం టీమ్‌ఇండియాకు ఎంతో ముఖ్యం. ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్‌.. ఇంకో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది.

ఇక సూర్యకుమార్‌ సూపర్‌ ఫామ్‌లో కొనసాగుతుండటం, కేఎల్‌ రాహుల్‌ కూడా లయ అందుకోవడం భారత్‌కు సానుకూలాంశం. తొలి టీ20లో పంత్‌, కార్తిక్‌లిద్దరికీ తుది జట్టులో చోటిచ్చిన భారత్‌.. ఈ మ్యాచ్‌లోనూ అలాగే చేస్తుందా చూడాలి. మొదటి మ్యాచ్‌లో అయిదుగురు బౌలర్లతో ఆడిన టీమ్‌ఇండియా.. అద్భుత విజయాన్ని అందుకుంది. బౌలర్లు గొప్పగా రాణించడంతో ప్రత్యర్థి జట్టును స్వల్ప స్కోరుకే కట్టడి చేసింది. అయితే.. రెండో టీ20లో ఆరో బౌలర్‌ను తీసుకోవాలని చూస్తే మాత్రం.. పంత్‌, కార్తిక్‌లలో ఒకరిని పక్కనపెట్టాల్సి ఉంటుంది. మరి ఆరో బౌలర్‌ ఆప్షన్‌ను సారథి రోహిత్‌ తీసుకుంటాడా.. లేదా చూడాలి. వెన్ను గాయంతో ఫాస్ట్‌బౌలర్‌ బుమ్రా ఈ సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే.

మరోవైపు రేసులో నిలవాలంటే దక్షిణాఫ్రికా తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ ఇది.  దీంతో ఆ జట్టును తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఈ నేపథ్యంలో సరైన ప్రణాళికలతో రోహిత్‌ సేన బరిలోకి దిగి విజయాల పరంపరను కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని