World Cup 2023: ప్రపంచ కప్‌లో అత్యధిక వికెట్ల వీరుడిగా కుల్‌దీప్‌ యాదవ్‌: పాక్ మాజీ కెప్టెన్

వన్డే ప్రపంచ కప్ 2023లో టీమ్ఇండియా (Team India) మణికట్టు స్పిన్నర్ కుల్‌దీప్‌ యాదవ్ (Kuldeep Yadav) అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలుస్తాడని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ అభిప్రాయపడ్డాడు.

Published : 16 Oct 2023 18:09 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్ 2023లో టీమ్ఇండియా (Team India) మణికట్టు స్పిన్నర్ కుల్‌దీప్‌ యాదవ్ (Kuldeep Yadav) అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలుస్తాడని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ అభిప్రాయపడ్డాడు. కుల్‌దీప్‌ బౌలింగ్‌ను పాక్‌ బ్యాటర్లలో ఒక్కరూ కూడా దీటుగా ఎదుర్కొలేకపోయారని పేర్కొన్నాడు. కుల్‌దీప్‌ యాదవ్‌ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడి ఐదు వికెట్లు పడగొట్టాడు. పాక్‌పై (2/35) మంచి ప్రదర్శన కనబర్చాడు. 

“కుల్‌దీప్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి పాక్‌ ఆటగాళ్లు భయపడ్డారు. అతడు బౌలింగ్‌లో ఎక్కువగా డిఫెన్స్‌ చేసేందుకే ప్రయత్నించారు. ఒక్కరూ కూడా అతడి బౌలింగ్‌లో దూకుడు ఆడలేకపోయారు. కుల్‌దీప్‌ యాదవ్‌కు విశ్రాంతి ఇవ్వకుండా అన్ని మ్యాచ్‌ల్లో ఆడితే ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలుస్తాడని భావిస్తున్నా. పాక్‌తో మ్యాచ్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. అతను భారత్ తరఫున అన్ని మ్యాచ్‌లు ఆడాలని భావిస్తున్నాను. అశ్విన్ ఆడితే మా జట్టు 190 పరుగులు కూడా చేసి ఉండేది కాదేమో’’ అని రషీద్‌ లతీఫ్‌ పేర్కొన్నాడు. మరోవైపు, వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి అగ్రస్థానంలో నిలిచిన టీమ్‌ఇండియా.. గురువారం (అక్టోబర్ 19న) బంగ్లాదేశ్‌తో తలపడనుంది. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని